ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం రెండు మ్యాచ్ ల టెస్ట్  సీరిస్ జరుగుతోంది.  ఇందులో భాగంగా జరిగినటువంటి మొదటి టెస్ట్ మ్యాచ్ లో చివరి రోజున ఇంగ్లాండ్ బౌలర్ జాతి వివక్షకు గురైనట్లు ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా  న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియం సన్ స్పందించాడు.

ఇందులో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్  కి వ్యక్తిగత క్షమాపణలు చెప్పాడు. అంతేగాక అసలు తాను జాతి దుర్వినియోగానికి గురైనట్లు ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ట్వీట్ చేసేంత వరకూ తనకు ఈ విషయం గురించి తెలియదని అన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆశిస్తున్నామని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు విలియం సన్. 

అయితే ఈ క్రమంలో  న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కమిటీ కూడా  జోఫ్రా ఆర్చర్ కి క్షమాపణలు తెలుపుతున్నట్లు అధికారికంగా ఒక నివేదికను కూడా విడుదల చేసింది. అంతేగాక ఈ విషయంపై విచారణ కోసమై పోలీసులకు ఆదేశాలను కూడా జారీ చేసింది.  అయితే జోఫ్రా ఆర్చర్ మాత్రం తన దేశం విజయం కోసం పోరాడుతున్న సంయమలో ఇలా జాతి దుర్వినియోగానికి గురవ్వడం చాలా బాధాకరమని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 

అయితే ఇది ఇలా ఉండగా ఈ నెల 29వ తారీఖు నుంచి  ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే  రెండు మ్యాచ్ ల టెస్ట్  సీరిస్ లో న్యూజిలాండ్ 1-0 తో ముందంజలో ఉంది.