Asianet News TeluguAsianet News Telugu

టాస్ 10 మీటర్ల అవతల పడింది: బౌలింగ్ చేశావా... టాస్ చేశావా అంటూ ట్రోలింగ్

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా టాస్ వేసే సమయంలో చేసిన విన్యాసాలు స్టేడియంలో ఉన్న వారితో పాటు టీవీలు చూస్తున్న వారికి నవ్వు తెప్పించాయి

Australia cricketer Usman Khawaja's Animated Toss In Marsh Cup Final Leaves Twitter In Splits
Author
Sydney NSW, First Published Nov 26, 2019, 4:17 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా టాస్ వేసే సమయంలో చేసిన విన్యాసాలు స్టేడియంలో ఉన్న వారితో పాటు టీవీలు చూస్తున్న వారికి నవ్వు తెప్పించాయి. అసలు మ్యాటర్ ఏంటంటే... ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో భాగమైన మార్ష్ కప్ వన్డే టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా-క్వీన్స్ ల్యాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది.

టాస్ వేసేందుకు గాను ఇరు జట్ల కెప్టెన్లు ఉస్మాన్ ఖవాజా-టర్నర్‌లు మైదానంలోకి వచ్చారు. టాస్ వేసేందుకు కాయిన్‌ను అందుకున్న ఖవాజా టాస్‌ను ఒక ఎండ్‌లో వేస్తే.. మరో ఎండ్‌లో కాయిన్ పడింది.

టాస్ వేయమని మ్యాచ్ రిఫరీ చెప్పగానే కాస్త ముందుకు దూకుతూ వెళ్లాడు. కాయిన్‌ను పైకి విసరగానే అది చాలా దూరంగా పడింది. దాదాపు 10 మీటర్ల దూరం వరకు వెళ్లి పడింది. దీంతో మ్యాచ్ రిఫరీ కాయిన్ పడిన ప్రదేశానికి వెళ్లి వెస్ట్రన్ ఆస్ట్రేలియా టాస్ గెలిచిందని చెప్పాడు. ఇక్కడ ఖవాజా ట్రిక్‌ను ప్రదర్శించినా టాస్ గెలవలేకపోయాడు.

సాధారణంగా టాస్ వేస్తే కాయిన్ సుమారుగా కెప్టెన్లు నిల్చొన్న ప్రాంతంలోనే పడుతుంది. ఖవాజా విన్యాసాలతో నవ్వులు పూయడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా టాస్‌ వేసిన తీరును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఖవాజాను ట్రోల్ చేస్తున్నారు. టాస్ వేయమంటే.. బౌలింగ్ చేశావేంటీ బాసు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Also Read:ఎలా ఆడాలో నేర్చుకో.. నువ్వు చెప్పకర్లేదు: వార్న్-ఖవాజాల మధ్య మాటల యుద్ధం

టాస్ కాయిన్ అనే సంగతి మరిచిపోయి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయాలనున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ జట్టులో ఖవాజా చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా సారథ్యంలోని క్వీన్స్ లాండ్ 49.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షాన్ మార్స్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఖవాజా కేవలం 26 పరుగులే చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios