ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ హవా ! మనోళ్లు దుమ్ము రేపారు.. !
ICC Rankings: ఐసీసీ ర్యాంగింగ్స్ మూడు ఫార్మాట్ లలో భారత్ నెంబర్ జట్టుగా ఉంది. అలాగే, వివిధ ఫార్మాట్ లలో భారత్ ప్లేయర్ల హవా కొనసాగుతోంది. టెస్టులో నెంబర్.1 బౌలర్, అలాగే, నెంబర్.1 ఆల్ రౌండర్ గా రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు.
ICC Rankings - India : అంతర్జాతీయ క్రికెట్ టీమిండియా హవా కొనసాగుతోంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు టాప్ లో కొనసాగుతోంది. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్ లలో భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. అలాగే, మన ప్లేయర్లు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపుతున్నారు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు టెస్టు క్రికెట్ లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం కోల్పోయి మూడో ప్లేస్ లోకి వచ్చాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా భారత బ్యాట్స్‌మెన్ భారీ జంప్ చేశారు. రోహిత్ శర్మ ఐదు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా ర్యాంకింగ్‌లో దూసుకెళ్లాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియాకు చెందిన పవులురు బ్యాట్స్‌మెన్‌లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ ఐదు స్థానాలు ఎగబాకి 6వ స్థానంలో నిలిచాడు. యశస్వి జైస్వాల్ ఇప్పుడు 2 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మొత్తం టెస్టు సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ టాప్ లో ఉన్నాడు.
ధోని లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ను నడిపించే నాయకుడు
టెస్టు, వన్డే, టీ20ల్లో నంబర్ 1 జట్టు గా భారత్ వుండగా, టెస్టు బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. , జస్‌ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచారు. నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, అదే ఫార్మాట్‌లో 6వ స్థానంలో యశస్వి జైస్వాల్ ఉన్నాడు. రవీంద్ర జడేజా టెస్టుల్లో ఆల్‌రౌండర్ నంబర్ 1 స్థానంలో, నంబర్ 2 లో అశ్విన్ ఉన్నాడు.
బుమ్రాను వెనక్కి నెట్టిన అశ్విన్
100వ టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి టెస్టు క్రికెట్ లో నెంబర్ బౌలర్ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో ధర్మశాల టెస్ట్ సందర్భంగా, అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 36వ సారి ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. ఈ సిరీస్ గెలవడంతో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
15 బంతుల్లోనే 6 వికెట్లు... WPL 2024 లో ఎల్లిస్ పెర్రీ బౌలింగ్ తుఫాను !