Asianet News TeluguAsianet News Telugu

15 బంతుల్లోనే 6 వికెట్లు... WPL 2024 లో ఎల్లిస్ పెర్రీ బౌలింగ్ తుఫాను !

WPL 2024: మ‌హిళల ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత‌మైన బౌలింగ్ తో 15 బంతుల్లోనే 6 వికెట్లు పడగొట్టింది. 
 

6 wickets in 15 balls. Ellyse Perry bowling storm in WPL 2024, MIW Vs RCBW RMA
Author
First Published Mar 13, 2024, 2:47 PM IST

WPL 2024 - Ellyse Perry : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ లో ఎల్లీస్ పెర్రీ చ‌రిత్ర సృష్టించింది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో బాల్, బ్యాట్ తో రాణించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు సూప‌ర్ విక్ట‌రీని అందించింది. రికార్డుల మోత మోగించింది. డ‌బ్ల్యూపీఎల్ 2024లో భాగంగా మంగ‌ళ‌వారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ మరోసారి విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో మొద‌ట బౌలింగ్ తో అద‌ర‌గొట్టిన ఎల్లీస్ పెర్రీ.. ఆ త‌ర్వాత బ్యాట్ తోనూ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడింది. తొలుత అద్భుత‌మైన బౌలింగ్ లో ముంబై లోని కీల‌క‌మైన ఆరు వికెట్లు తీసుకుంది. ఆ త‌ర్వాత ల‌క్ష్య చేధ‌న‌లో 40* ప‌రుగుల‌తో అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఎల్లీస్ పెర్రీ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టింది. దీంతో డబ్ల్యూపీఎల్ లో చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ప్లేయ‌ర్ గా ఎల్లీస్ పెర్రీ ఘ‌న‌త సాధించింది. అలాగే, దక్షిణాఫ్రికా బౌలర్ మారిజానే కాప్ రికార్డును బద్దలు కొట్టింది.

ధోని లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ను నడిపించే నాయకుడు ఎవరు...?

 

గత సీజన్లో జరిగిన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో మారిజానే  15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న సమయంలో గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో మారిజానే ఈ గ‌ణాంకాలు న‌మోదుచేశారు. గతంలో డబ్ల్యూపీఎల్లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే 4-4 వికెట్లు తీయగలిగారు. కాగా, ఈ మ్యాచ్ లో తొలి 9 బంతుల్లో ఎలీస్ పెర్రీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కానీ, ఆ త‌ర్వాత విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టి తర్వాతి 15 బంతుల్లోనే 6 వికెట్లు పడగొట్టారు.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన తర్వాత తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఎల్లీస్ పెర్రీ విధ్వంసం ముందు పూర్తిగా నిస్సహాయంగా కనిపించింది. 19 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బౌలింగ్ అనంతరం ఎల్లీస్ పెర్రీ మరోసారి బ్యాటింగ్ లో కూడా రాణించింది. 38 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేసింది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో కోహ్లి ఉంటాడు.. !

Follow Us:
Download App:
  • android
  • ios