ICC Rankings: సత్తా చాటిన గిల్.. కోహ్లీని బీట్ చేసిన రోహిత్.. భారత ప్లేయర్లు ఏ ర్యాంకులో ఉన్నారంటే?

ICC Rankings: ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత జట్టు గెలుచుకున్న తర్వాత వన్డే ర్యాకింగ్స్ లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. శుభ్‌మన్ గిల్ టాప్ లో ఉండగా, రోహిత్ శర్మ కోహ్లీని అధిగమించాడు. 

ICC ODI Rankings: Rohit Sharma beats Virat Kohli, closes gap with Babar Azam as Shubman Gill holds top in telugu rma

ICC Rankings: కొత్తగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన ఇండియాకు లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్‌లో చాలా లాభాలు జరిగాయి. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు, కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో మూడో స్థానానికి ఎగబాకాడు, రవీంద్ర జడేజా బౌలర్లలో టాప్ 10లోకి వచ్చేశాడు.

దుబాయ్‌లో ఆదివారం జరిగిన టోర్నమెంట్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఇండియా తన మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో భారత ప్లేయర్లు లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్ము రేపారు.

స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ము రేపడంతో తాజా వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. ఇండియన్ టీమ్‌మేట్, ఎక్స్‌పీరియన్స్డ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్నింగ్స్ తో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఫైనల్ లో రోహిత్ కేవలం 83 బంతుల్లో 76 పరుగులు చేసి ఇండియా గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ ఐసీసీ టోర్నీలో 218 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ వన్డే ర్యాకింగ్స్ లో టాప్ ఫైవ్‌లో నిలిచాడు.

 

న్యూజిలాండ్ ప్లేయర్లు డారిల్ మిచెల్ (ఒక స్థానం పెరిగి ఆరో స్థానానికి), రచిన్ రవీంద్ర (14 స్థానాలు పెరిగి 14వ స్థానానికి), గ్లెన్ ఫిలిప్స్ (ఆరు స్థానాలు పెరిగి 24వ స్థానానికి) వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పెరుగుదలను నమోదుచేశారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వన్డే బౌలర్ల లిస్టులో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. సాంట్నర్ ఛాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది వికెట్లు తీశాడు, ఫైనల్‌లో రెండు వికెట్లు తీశాడు. దీంతో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆరు స్థానాలు పెరిగి వన్డే బౌలర్ల లిస్టులో రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ  టాప్ లో ఉన్నాడు. 

Indian Youngest Cricketer: 12 ఏళ్లకే రికార్డులు బద్దలు - వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రయాణం ఇది ! 

టీమ్‌మేట్ మైఖేల్ బ్రేస్‌వెల్ (10 స్థానాలు పెరిగి 18వ స్థానానికి) కూడా న్యూజిలాండ్ తరపున తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన ఇద్దరు ఇండియన్ స్పిన్నర్లు టాప్ 10లోకి వచ్చారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (మూడు స్థానాలు పెరిగి మూడో స్థానానికి) టోర్నమెంట్‌లో ఏడు వికెట్లు తీయడంతో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. రవీంద్ర జడేజా కూడా మూడు స్థానాలు పెరిగి 10వ స్థానానికి చేరుకున్నాడు. అతను ఈ ఈవెంట్‌లో ఇండియా తరపున ఐదు వికెట్లు తీశాడు.

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ అజ్మతుల్లా ఒమర్జాయ్  వన్డే ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు. సాంట్నర్ ఒక స్థానం పెరిగి నాలుగో స్థానానికి చేరుకున్నాడు, బ్రేస్‌వెల్ ఏడు స్థానాలు పెరిగి ఏడో స్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర ఎనిమిది స్థానాలు పెరిగి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు సెంచరీలు, మూడు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.

దుబాయ్ నుండి రాగానే సోదరి పెళ్లిలో రిషబ్ పంత్ డ్యాన్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios