Asianet News TeluguAsianet News Telugu

హ్యాట్సాఫ్.. హార్దిక్ పాండ్యాపై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైర‌ల్.. ఎమ‌న్నాడంటే?

Team India : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ గెలిచిన టీమిండియా విక్ట‌రీ ప‌రేడ్ అద్భుతంగా సాగింది. అలాగే, వాంఖ‌డే స్టేడియంలో భార‌త జ‌ట్టు విజ‌యోత్స‌వ వేడుక‌లు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ క్ర‌మంలోనే స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 
 

Hats off to him for.. Rohit Sharma's comments on Hardik Pandya go viral What's the matter? RMA
Author
First Published Jul 5, 2024, 1:26 PM IST

Rohit Sharma : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీ గెలిచిన త‌ర్వాత భార‌త జ‌ట్టు సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. మ‌రీ ముఖ్యంగా ముంబైలో జ‌రిగిన టీమిండియా విక్ట‌రీ వేడుక‌లు క్రికెట్ జ‌న జాత‌ర‌ను త‌ల‌పించాయి. టీమిండియా విక్ట‌రీ ఓపెన్ బ‌స్ రోడ్ షో త‌ర్వాత వాంఖ‌డే స్టేడియంలో ఘ‌నంగా విజ‌యోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే భార‌త జ‌ట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జీవితంలో మ‌రిచిపోలేని క్ష‌ణాలు క‌నిపించాయి. దాదాపు రెండు నెల‌ల క్రీతం ఇదే స్టేడ‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు ఇక్క‌డే క్రికెట్ అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 

హార్దిక్ హార్దిక్ అంటూ వాంఖ‌డే స్టేడియాన్ని హోరెత్తించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో హార్దిక్ పాండ్యా అద్భుత‌మైన బౌలింగ్ తో మ్యాచ్ ను భార‌త్ వైపు తీసుకువ‌చ్చాడు. వ‌రుస‌గా బౌండ‌రీలో మ్యాచ్ ను త‌మ‌వైపుకు లాక్కునే ప్ర‌య‌త్నం చేసిన హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌లను కీల‌క స‌మ‌యంలో ఔట్ చేశాడు. దీంతో టీమిండియా అద్భుత విజ‌యాన్ని అందుకుంది. దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత్ రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్రశంసించారు. వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన  విజ‌యోత్స‌వ వేడుక‌ల్లో రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. "ఈ ట్రోఫీ యావత్ దేశానికి సంబంధించినది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లందరితో పాటు, 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మా అభిమానులకు దీనిని అంకితం చేయాలనుకుంటున్నాము" అని అన్నారు. 

అప్పుడు విమ‌ర్శ‌లు ఇప్పుడు పొగ‌డ్త‌లు.. 'హార్ధిక్ హార్దిక్' అంటూ ద‌ద్ద‌రిల్లిన వాంఖ‌డే.. వీడియో

అలాగే, "ముంబయి ఎప్పుడూ మ‌మ్మ‌ల్ని నిరుత్సాహ ప‌ర్చ‌దు. మాకు ఘనమైన ఆదరణ లభించింది. జట్టు తరపున మేము అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను.. " అని రోహిత్ అన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ క‌ప్ పైన‌ల్ లో హార్దిక్ పాండ్యా ఆట‌ను ప్ర‌శంసించారు. దీంతో ఒక్క‌సారిగా హార్దిక్ హార్దిక్ అంటూ ముంబై స్టేడియం ద‌ద్ద‌రిల్లింది. అక్క‌డున్న హార్దిక్ లేచినిల‌వ‌డి చేతులెత్తి అభిమానుల‌కు అభివాదం తెలిపారు.

 

 

"హార్దిక్ అంత పెద్ద ఓవర్‌ను బౌలింగ్ చేస్తున్నాడు. చివ‌రి ఓవ‌ర్ లో ఆ పని చేసినందుకు హ్యాట్సాఫ్. ఎన్ని పరుగులు కావాలన్నది ముఖ్యం కాదు. చివరి ఓవర్ బౌలింగ్‌లో చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, అద్భుతం చేశాడు.. అతనికి హ్యాట్సాఫ్" అని రోహిత్ శర్మ అన్నారు. హిట్ మ్యాన్ ఇలా అనడంతో వాంఖడే మొత్తం హార్దిక్-హార్దిక్ నినాదంతో మారుమోగింది. అభిమానుల నుంచి వ‌చ్చిన ప్రేమ‌.. ఆద‌ర‌ణ అద్భుత‌ క్ష‌ణాలు హార్దిక్ కు జీవితంతో మర్చిపోలేని బహుమతి అని చెప్పాలి. అక్క‌డే ఉన్న‌ హార్దిక్ స్వయంగా లేచి నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో హార్దిక్150కి పైగా స్ట్రైకింగ్ రేట్‌తో 144 పరుగులతో పాటు 11 వికెట్లు తీసుకున్నాడు.

టీమిండియా విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు.. కుప్పలుగా చెప్పులు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios