హార్దిక్ చేసిన పనికి నవ్వాపుకోలేక పోయిన జస్ప్రీత్ బుమ్రా ! వీడియో
Team India : న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, భారత క్రికెట్ జట్టు ముంబైకి చేరుకుని టీ20 ప్రపంచ కప్ 2024 విక్టరీ వేడుకల్లో పాలుపంచుకుంది. ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆటగాళ్లను సన్మానించింది. వారికి రూ.125 కోట్ల ప్రైజ్ మనీని అందించింది.
Team India : ముంబైలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విక్టరీ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, గురువారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచ కప్ విజయాన్ని జరుపుకుంటున్నప్పుడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పటాకా కామెడీ జరిగింది. హార్దిక్ చేసిన పనికి టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా నవ్వాపుకోలేక పోయాడు. భారత జట్టుతో కలిసి హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియం గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇంతలో గాలిలో ఎగురుతున్న టీ షర్ట్ హార్దిక్ పాండ్యా దగ్గరకు వచ్చింది. మంచి సమయంలో వందేమాతరం పాటకు ఫుల్ జోష్ లో జై కొడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా చేతులెత్తగా సడెన్ గా టీషర్ట్ వచ్చి పడింది.. దీంతో వెనుకనే నిలబడిన జస్ప్రీత్ బుమ్రా నవ్వు ఆపుకోలేకపోయాడు.
ఏంటీ ఈ టీషర్ట్ కథ..
గురువారం సాయంత్రం వేలాది మంది క్రికెట్ అభిమానులు టీమిండియా విజయోత్సవాలలో పాలుపంచుకున్నారు. టీమిండియాకు స్వాగతం పలికేందుకు విజయ్ పరేడ్‌కు ముంబైలో భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. మెరైన్ డ్రైవ్ రోడ్ షో తర్వాత ప్రపంచ చాంపియన్ టీమ్ ఇండియా ఆటగాళ్లు ముంబైలోని వాంఖడే స్టేడియంకు వచ్చారు. వాంఖడే స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ భారత క్రికెటర్లు గ్రౌండ్ లోపల చుట్టూ తిరుగుతూ తమకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో స్టేడియంలో వందేమాతరం సాంగ్ ప్లే అవుతోంది. అందరూ మంచి జోష్ లో ఉన్నారు. జై కొట్టే సమయంలో హార్దిక్ పాండ్యా చేతులెత్తగా.. ఏవరో ఒక అభిమాని విసిరిన టీషర్ట్ నేరుగా హార్దిక్ చేతిలో పడింది. తన దగ్గరకు వచ్చిన టీషర్ట్ ను పట్టుకున్న హార్దిక్.. వెంటనే దానిని విడిచిపెట్టాడు. ఇది చూసిన జస్ప్రీత్ బుమ్రా తనను తాను నియంత్రించుకోలేక నవ్వడం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పవరకు 4 ప్రపంచ కప్ లను గెలుచుకున్న టీమిండియా
17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అంతకుముందు, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ చివరిసారిగా 2007 టీ20 ప్రపంచకప్‌లో మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. 13 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ తర్వాత భారత్ ఛాంపియన్ గా నిలిచింది. చివరిసారిగా 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా భారత జట్టు గొప్ప రికార్డు సృష్టించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 4 ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకోవడంలో భారత్ చరిత్ర సృష్టించింది.
టీమిండియాతో మీటింగ్‌లో రోహిత్, కోహ్లీలను ప్రధాని మోడీ ఏమడిగారో తెలుసా?