ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ మ్యాక్స్ వెల్ తాజాగా భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్ ను పెళ్లాడనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు ఈ ఆసీస్ ఆటగాడు. 

హ్యాపీ బర్త్ డే టు మై స్టన్నింగ్ ఫియాన్సీ అని రాసుకొచ్చాడు. దానికి విని రామం కూడా స్పందించి ఒక చమత్కారమైన కామెంట్ ని జతచేసింది. నీ ఇంస్టాగ్రామ్ ఫిల్టర్ల సెలక్షన్ అంతా బాగాలేకపోయినా, నువ్వంటే నాకిష్టం ఐ లవ్ యు అని తెలిపింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Birthday to my stunning fiancé! You’re awesome 🥰 #birthdaygirl #loveyou

A post shared by Glenn Maxwell (@gmaxi_32) on Mar 3, 2020 at 3:38am PST

గత నెలలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారని ఇంస్టాగ్రామ్ వేదికగా వారు తమ ఎంగేజ్మెంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే! ప్రేయసికి ఉంగరం తొడిగేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దానికి  సంబంధించిన ఫోటోలను కూడా మ్యాక్సీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

ఆ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన  గర్ల్‌ ఫ్రెండ్‌ వినీ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం.మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్‌ క్రిస్‌ లిన్‌ వారికప్పుడు శుభాకాంక్షలు కూడా తెలిపాడు.

Also Read ఇండియన్ యువతి ప్రేమలో ఆసిస్ క్రికెటర్...

మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది.  గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. 

మ్యాక్సీ-విని తరచుగా ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానసిక సమస్యలు కారణంగా కొంతకాల క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అయితే తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు మొదట గుర్తించింది విని రామనే అని మ్యాక్స్‌వెల్‌ అప్పట్లో వెల్లడించాడు. 

భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా అతడు నిలవనున్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ షాన్‌ టైట్‌.. మషూమ్‌ సింఘా అనే యువతిని ప్రేమించిన పెళ్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.