ఆసిస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఇండియన్ యువతి ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబానికి చెందిన యువతి వినీ రామన్‌తో  మ్యాక్స్ వెల్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది.వీరిద్దరూ  చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో తిరుగుతున్నారు.  విందు వినోదాల్లోనూ ఎక్కడ చూసినా ఇద్దరూ ఒక్కచోటే కనపడుతున్నారు. త్వరలోనే వీరు పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆసీస్ పేసర్ షాన్ టైట్ కూడా భారత అమ్మాయినే పెళ్లాడాడు. ఇప్పుడు మ్యాక్స్‌వెల్-వినీరామన్ ఒక్కటైతే భారత యువతిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా మ్యాక్ష్‌వెల్ రికార్డులకెక్కుతాడు. ఐపీఎల్ 2014లో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్ సింఘా‌తో షాన్‌టైట్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు.