టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్.. !
Team India Head Coach : టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, కేకేఆర్ కు ఐపీఎల్ 2024 టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కాబోతున్నారనీ, డీల్ దాదాపు పూర్తయిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Team India Head Coach : అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత భారత్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ మెగా టోర్నమెంట్ ముగిసే సమయానికి కొత్త ప్రధాన కోచ్‌ని బీసీసీఐ నియమించనుంది. ఈ పదవికి దరఖాస్తుల కోసం బీసీసీఐ సమయం ఇవ్వగా, ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పాటు మే 27తో గడువు ముగిసింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో అనేక మంది పేర్లు వినిపించాయి. ఈ వార్తల మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ రేసులో కేకేఆర్ ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుత మెంటర్ గౌతమ్ గంభీర్ ముందున్నట్టు సమాచారం.
క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం.. బీసీసీఐ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఉన్నత స్థాయి ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని.. భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం ఒప్పందం పూర్తయినట్టేనని పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం గంభీర్‌ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీసీఐ కూడా ఇప్పటికే సంప్రదించిదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గౌతమ్ గంభీర్ ఈ పాత్ర కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడనీ, జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండాలనే ప్రతిపాదనను తాను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అతనికి సన్నిహితులతో చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఈ విషయం కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌కు కూడా తెలుసునని నివేదించింది.
అంబటి రాయుడు నువ్వు ఒక 'జోకర్'.. కెవిన్ పీటర్సన్ ఇలా అన్నాడేంటి భయ్యా..
గంభీర్-బీసీసీఐ సెక్రటరీ జైషా మధ్య ప్రధాన కోచ్ పదవికి సంబంధించి పలు చర్చలు జరిగాయని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. కాగా, గౌతమ్ గంభీర్ తన కోచ్ కెరీర్‌లో అద్భుతమైన విజయాలు సాధించాడు. అతను 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా పనిచేశాడు. 2022, 2023లో ఫ్రాంచైజీని రెండు వరుస ప్లేఆఫ్‌లకు తీసుకెళ్లాడు. ఐపీఎల్ 2024 వేలానికి ముందు కేకేఆర్ తో జతకట్టిన గంభీర్.. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఫ్రాంచైజీ కేకేఆర్ జట్టులోకి రావడంతో పాటు మరోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో గంభీర్ చాలా ప్రభావమే చూపాడు. కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా, కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఐపీఎల్ గెలిచిన రెండవ వ్యక్తిగా గంభీర్ నిలిచాడు. అయితే, భారత ప్రధాన కోచ్ పదవి ఎంపిక గురించి బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
మీరందరూ మమ్మల్ని గర్వించేలా చేసారు.. కావ్య మారన్ వీడియో వైరల్