మీరందరూ మమ్మల్ని గర్వించేలా చేసారు.. కావ్య మారన్ వీడియో వైరల్

Kavya Maran : ఐపీఎల్ 2024 లో ఫైనల్ వరకు సాగిన‌ ప్రయాణం గురించి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ కావ్య మార‌న్ మాట్లాడుతూ.. జట్టు స‌మిష్టి కృషి, దృఢ సంకల్పాన్ని ప్రశంసించింది. గ‌త సీజన్ నుండి ఇప్పుడు చేరిన అద్భుతమైన మలుపు గురించి ప్ర‌స్తావిస్తూ.. ఎస్ఆర్హెచ్ విజయానికి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సమిష్టి కృషి కారణమని పేర్కొంది.
 

All of you have made us proud..  SunRaisers Hyderabad owner Kavya Maran's video goes viral  RMA

SRH Kavya Maran : కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. మే 26న చెన్నైలోని ఎంఏ. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. ఇది ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఫైనల్‌ల్లో అత్యల్ప స్కోర్‌. లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన కేకేఆర్ కేవలం 11 ఓవర్లలోనే విజయాన్ని అందుకొని 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మూడో ఐపీఎల్ టైటిల్ ను త‌న ఖాతాలో వేసుకుంది. అయితే, ఫైన‌ల్ లో ఓట‌మిని హైద‌రాబాద్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఓడిన‌ప్ప‌టికీ ఐపీఎల్ 2024 లో స‌న్ రైజ‌ర్స్ ఫైన‌ల్ వ‌ర‌కు సాగిన‌ గొప్ప ప్ర‌యాణంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ త‌న టీమ్ తో  డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఫైన‌ల్లో ఓడిన‌ప్ప‌టికీ వారి జ‌ట్టు నిరాశ‌ను పోగొట్ట‌డానికీ ప్ర‌య‌త్నించారు. మ్యాచ్ ఓట‌మి క్ర‌మంలో గ్రౌండ్ లో కావ్య తన టీమ్‌తో పాటు కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ఆ త‌ర్వాత త‌న టీమ్ తో మాట్లాడిన క్ష‌ణాలు నిజంగా గొప్ప‌వి. కావ్య మాట్లాడుతున్న వీడియోను ఎస్ఆర్హెచ్ త‌న అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. త‌న టీమ్ కు పూర్తిగా మ‌ద్ద‌తు తెల‌ప‌డం అందులో క‌నిపించింది. 

IPL 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ ఓటమి.. ఏడ్చేసిన కావ్య మార‌న్.. వీడియో

ఈ సీజన్ మొత్తంలో జట్టు గెలుపు కోసం చేసిన‌ ప్రయత్నాలను గుర్తించి కావ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐపీఎల్ 2024 ప్రారంభంలో పాయింట్ల ప‌ట్టిక‌లో దిగువ‌న నిలిచినప్ప‌టికీ ఆ త‌ర్వాత అద్భుతంగా ఫైన‌ల్ వ‌ర‌కు చేరిన ప్రయాణం గొప్ప‌ద‌ని కొనియాడింది. జ‌ట్టు బ్యాటింగ్ రికార్డులను గ‌ర్వంగా చెప్పారు. "మీరందరూ మమ్మల్ని చాలా గర్వించేలా చేసారు. నేను ఇక్కడికి వచ్చి మీకు ఇదే చెప్పాల‌నుకున్నాను.. మేము టీ20 క్రికెట్‌ను ఆడే విధానాన్ని మీరు పునర్నిర్వచించారని నా ఉద్దేశ్యం.. అందుకే ఇప్పుడు అందరూ మన‌ గురించి మాట్లాడుతున్నారు” అని కావ్య చెప్పింది. ఆఖరి మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ జట్టు చూపిన సానుకూల ప్రభావాన్ని హైలైట్  చేశారు.

అలాగే, జ‌ట్టు దృఢ సంకల్పాన్ని ప్రశంసించింది. ఆమె మునుపటి సీజన్ నుండి ఈ సీజ‌న్ లో సాగించిన అద్భుతమైన ప్ర‌యాణం గురించి ప్రస్తావించింది. ఈ విజ‌యానికి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సమిష్టి కృషి కారణమని పేర్కొంది. "ఈ రోజు ఆఫ్-డే జరగాలి, కానీ మీరందరూ బ్యాట్, బాల్‌తో నిజంగా గొప్ప పని చేసారు. చాలా ధన్యవాదాలు" అని ఆమె జట్టు స‌భ్యులు చేసిన కృషి,  అంకితభావానికి తన కృతజ్ఞతలు తెలిపారు. కావ్య తన ప్రసంగాన్ని ముగించే ముందు జట్టు తమ ముఖాలపై చిరునవ్వును నింపింది.

 

 

T20 WORLD CUP 2024 : మెగా టోర్నీలో సెమీస్ చేరే జ‌ట్లు ఇవే.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios