అంబటి రాయుడు నువ్వు ఒక 'జోకర్'.. కెవిన్ పీటర్సన్ ఇలా అన్నాడేంటి భయ్యా..
T20 Cricket : భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడి పై ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 'జోకర్' అనడమేంటని మరో వివాదం రాజుకుంది.
Kevin Pietersen - Ambati Rayudu : ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుచేసిన కోల్ కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీతో ఛాంపియన్ గా నిలిచింది. అయితే, స్టార్ స్పోర్ట్స్‌లో షో సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటర్సన్, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్, భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ క్రమంలోనే అంబటి రాయుడును జోకర్ అంటూ కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సరదా సంభాషణలో జోకర్ కామెంట్స్ రావడం అంబటి రాయుడు అభిమానులు షాక్ గురవుతున్నారు. అయితే, దీని వెనుక కథను చూస్తే.. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో అంబటి రాయుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు సపోర్టు చేస్తూ ఆరెంజ్ జెర్సీని ధరించాడు. కానీ, ఫైనల్లో కేకేఆర్ గెలిచిన తర్వాత అంబటి రాయుడు తన జెర్సీని మార్చుకుని కనిపించాడు. కోల్ కతా జెర్సీని ధరించి రావడంతో కెవిన్ పీటర్సన్ గమనించి ఇదే విషయం ప్రస్తావించారు. మ్యాచ్ కు ముందు.. తర్వాత మారిపోయావంటూ నువ్వు ఒక జోకర్.. నిజంగా నువ్వు జోకర్ కామెంట్ చేశారు. దీనికి స్పందించిన రాయుడు.. తాను రెండు జట్లకు సపోర్టు చేస్తున్నాననీ, మంచి క్రికెట్ కు మద్దతు ఇస్తున్నానని చెప్పాడు.
అయితే, దీని తర్వాత సోషల్ మీడియాలో కలకలం మొదలైంది. కెవిన్ పీటర్స్ ఇలా అంబటి రాయుడు ను జోకర్ అనడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. పీటర్సన్ పై తీవ్రంగా ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పీటర్సన్ స్పందిస్తూ ఇది ఆపాలని కోరాడు. సరదా సన్నివేశాన్ని మరోలా అర్థం చేసుకోవద్దనీ, ఇలాంటి మ్యాచ్ విశ్లేషణల సమయంలో ఉంటాయని పేర్కొన్నాడు. భారత ప్లేయర్ల పట్ల స్పందనలు చూసినప్పుడు ఇలా తీవ్రంగా స్పందించడం కాస్త తగ్గించాలని కోరాడు.
మీరందరూ మమ్మల్ని గర్వించేలా చేసారు.. కావ్య మారన్ వీడియో వైరల్