సొంత గడ్డపై తదక్షిణాఫ్రికాను వైట్ వాష్ చేసి జోష్‌లో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌పై దృష్టిసారించింది. ఈ క్రమంలో బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ సిరీస్‌పై ఫోకస్ పెట్టారు. బంగ్లాతో జరిగే సిరీస్‌కు జట్టును ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు టీమిండియా ఆడిన చివరి 56 అంతర్జాతీయ సిరీస్‌లలో 48 మ్యాచ్‌ల్లో పాల్గొన్న సారథి విరాట్ కోహ్లీకి టీ20లలో విశ్రాంతినివ్వాలని గంగూలీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇండోర్, కోల్‌కతాలలో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది.

రాంచీలో దక్షిణాఫ్రికాపై గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ..దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం గొప్పగా ఉందని.. బీసీసీఐ అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనతో టచ్‌లో ఉంటారని కోహ్లీ పేర్కొన్నాడు.

Also Read:వాళ్లిద్దరి వల్లే ఇదంతా: కోహ్లీ, రవిశాస్త్రిని ఆకాశానికెత్తేసిన రోహిత్ శర్మ

తాను ముందుగానే గంగూలీని కలుస్తానని.. కాకపోతపే ఇప్పటి వరకు మహీ గురించి కానీ జట్టు గురించి కానీ దాదా తనతో మాట్లాడలేదని విరాట్ మీడియాకు తెలిపాడు. అక్టోబర్ 24న బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండబోతున్న గంగూలీని తాను కలుస్తానన్నాడు.

అధ్యక్షుడితో టీమిండియా కెప్టెన్‌గా ఏం మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతానన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెటర్లు 11 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టడంతో భారత్‌తో సిరీస్ సందిగ్థంలో పడింది.

జీతాల పెంపుతో పాటు ఢాకా ప్రీమియర్ లీగ్, నేషనల్ క్రికెట్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో ప్రాక్టీస్ సదుపాయాలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే దేశంలో మ్యాచ్‌ల కోసం వెళ్లే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

Also Read:రూ.కోట్లలో జీతం నిద్రపోవడానికేనా..? రవిశాస్త్రిపై నెటిజన్ల సీరియస్

నవంబర్ 3 నుంచి భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన మొదలుకానుంది. ఇందులో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ నిమిత్తం 2 టెస్టుల సిరీస్, మూడు టీ20లు జరుగుతాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మెపై గంగూలీ స్పందిస్తూ ఇది పూర్తిగా ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్గత వ్యవహారమని.. బీసీసీఐకి ఇందులో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశాడు.

ఒకవేళ అనివార్య పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ జరగని పక్షంలో పూర్తి పాయింట్లను ఐసీసీ భారత్‌కే కేటాయించే అవకాశం వుంది. 

కాగా రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సఫారీలపై ఘనవిజయం సాధించి  భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. దీంతో  3-0తో సిరీస్‌ని క్లీన్ స్విప్ చేసింది.

విశాఖలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఆ తర్వాత పుణె టెస్టులోను , 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా రాంచీ టెస్ట్‌లోను  తన సత్తా చాటి మరో సారి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో  నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలురెండు ఓవర్లలోనే ఆలౌటయ్యారు. భారత బౌలర్ నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో  రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది .