పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కాకుండా టెస్ట్ ఫార్మాట్ లో కూడా ఓపెనింగ్ చేసేందుకు సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సిద్దమయ్యాడు. సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్‌లో రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే టీ20, వన్డేల్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు శుభారంభాన్నిచ్చే రోహిత్ టెస్టుల్లో ఏ మేరకు రాణించగలడా అన్న అనుమానం కొందరు అభిమానుల్లో మెదులుతోంది. తాజాగా రోహిత్ టెస్ట్ ఓపెనర్ గా మారుతుండటంపై మాజీ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ నయాన్ మోంగియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

''పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరిగా టెస్టుల్లో ఓపెనింగ్ చేయాలనుకుంటే కుదరదు. ఐదు రోజుల ఆటకు ఒక్క రోజు ఆటకు చాలా తేడా వుంటుంది. టెస్టు ఓపెనర్ గా రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలను మార్చుకోవడం, బ్యాటింగ్ పై నియంత్రణను కలిగివుండటం, ఆవేశంతో కాకుండాఆలోచనతో ఆడినప్పుడే టెస్టుల్లో రాణించగలం. అంతేకాకుండా ప్రత్యర్థి బౌలర్ సహనాన్ని  పరీక్షించి అతడి నుండి చెత్త బంతులను రాబట్టాల్సివుంటుంది. అందుకోసం చాలా ఓపిగ్గా ఆడాలి. 

వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే టెస్టుల్లో రోహిత్ ఓపెనర్ గా రాణించకపోవచ్చని అనిపిస్తోంది. కానీ ఈ ఫార్మాట్ కు తగ్గట్లుగా తన ఆటను మార్చుకుంటే మాత్రం ఇందులోనూ గొప్ప ఓపెనర్ గా ఎదుగుతాడు. కానీ అది అంత సులభమైన పని కాదు.  ఒకవేళ టెస్టుల్లో రోహిత్‌ ఓపెనర్‌గా కుదురుకుంటే అది అతని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ప్రభావం చూపించవచ్చు. కాబట్టి రెండు ఫార్మాట్లను బ్యాలెన్స్ చేసుకోవడం రోహిత్ కు కత్తిమీద సాములా మారునుంది. అతడికే కాకుండా ఇది టీమిండియాకు కూడా నష్టాన్ని చేకూర్చే అవకాశముంది.'' అని మోంగియా పేర్కొన్నాడు. 

కొద్దిరోజులక్రితం ముగిసిన వెస్టిండిస్ పర్యటనలో రోహిత్ కు తీవ్ర నిరాశకు గురయ్యాడు. విండీస్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో రోహిత్ కేవలం డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాడు. అతన్ని కాదని టీమిండియా మేనేజ్ మెంట్ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లను ఓపెనర్లుగా బరిలోకి దింపింది. అంతేకాకుండా తెలుగు తేజం హనుమ విహారికి మిడిల్ ఆర్డర్ లో అవకాశం కల్పించారు. వీరిలో మయాంక్, విహారీ లు రాణించగా రాహుల్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడికి సౌతాఫ్రికా తో జరగనున్న టెస్ట్ సీరిస్ నుండి తప్పించిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ కు అవకాశం కల్పించారు.   

తాజా వార్తలు

రోహిత్ కు కాస్త ఇబ్బందే... కానీ ఇదే మంచి అవకాశం: సంజయ్ బంగర్

రాహుల్ స్థానం రోహిత్ దే...బిసిసిఐ ఆలోచనే..: ఎమ్మెస్కే

భారత్-సౌతాఫ్రికా టెస్ట్ సీరిస్: రాహుల్ కు షాక్... రోహిత్ లైన్ క్లియర్