Asianet News TeluguAsianet News Telugu

"టీ 20లో విధ్వంసం.. వన్డేల్లో విఫలం.. " సూర్య భాయ్ పై ట్రోల్

Nasser Hussain-Suryakumar: టీమిండియా స్పెషలిస్టు బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) వన్డేల్లో ఇబ్బంది పడిన.. టీ20ల్లో మాత్రం దుమ్ము రేపుతాడు.  రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో సూర్య హైలైట్‌గా నిలుస్తాడనే మాజీ క్రికెటర్ అభిప్రాయ పడ్డారు.  

former England captain Nasser Hussain says Suryakumar Yadav is a bit clueless in 50-overs cricket KRJ
Author
First Published Jan 4, 2024, 7:42 AM IST

Nasser Hussain-Suryakumar: 2021లో భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేసిన సూర్యకుమార్ ఇప్పటివరకు 60 టీ20 మ్యాచుల్లో నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2022లో ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. కానీ,వన్డేల్లో మాత్రం తన మార్క్ సరైన విధంగా చూపించలేకపోయారు.

అదే విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఉటంకిస్తూ.. ప్రస్తుతం T20 క్రికెట్‌లో ప్రపంచం మొత్తం సూర్యకుమార్‌ వైపే చేస్తుంది. అతను టీ 20లో అద్భుతంగా రాణిస్తాడు. మిస్టర్ 360గా గొప్పగా సత్తాచాటుతున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతాడు. కానీ, వన్డేల్లో మాత్రం సత్తాచాటలేకపోతున్నాడని విమర్శించారు. 

నాసిర్ హుస్సేన్ ఇంకా మాట్లాడుతూ.. “టీ20 క్రికెట్‌లో ఏ క్షణంలో ఎలా  ఆడాలో అతనికి చాలా బాగా తెలుసు. టీ20 అంటే సరదా క్రికెట్, సూర్యకుమార్ బ్యాటింగ్ చూడటం మరింత సరదాగా ఉంటుందని ప్రశంసించారు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడని నాజర్ హుస్సేన్ చెప్పాడు. ప్రస్తుతం టీ20 ఫార్మట్‌ ఐసీసీ ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్ 1గా ఉన్న సూర్యకుమార్.. టోర్నీ మొత్తానికీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటాడని పేర్కొన్నారు. వన్డేల్లో తాను విఫలమవుతున్న సూర్యకుమార్‌విమర్శలు ఎదుర్కోవడం ఇది కొత్తేమి కాదు. ప్రపంచకప్ అనంతరం జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ సూర్యను దారుణంగా ట్రోల్ చేశాడు.

టీ20 ప్రపంచకప్‌ను ఎవరు గెలుస్తారు?

ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టైటిల్ గెలవగలదని హుస్సేన్ అన్నాడు. ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయినప్పటికీ ప్రస్తుతం ఫామ్‌లో లేదు. వెస్టిండీస్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. పాకిస్థాన్ కూడా అంతే. దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్‌ మధ్య ఫైనల్‌ జరుగుతుందని భావిస్తున్నా. విశ్వవిజేతగా సౌతాఫ్రికా నిలుస్తుందని అనుకుంటున్నా. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గొప్పగా సత్తాచాటుతుందని పేర్కొన్నాడు. గత ఏడాది ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్.. అందులో నుంచి గుణపాఠాలను నేర్చుకుందని  అన్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఆ లీగ్ అనుభవం సఫారీ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. కాగా, జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌నకు అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios