AUS vs PAK: బాక్సింగ్ డే టెస్టులో పాకిస్థాన్ ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. మూడు టెస్టులు సిరీస్ ను ఆసీస్ సొంతం చేసుంది. అయితే, రెండో టెస్టులో ఒకే బంతికి బౌండరీ లేకుండానే ఐదు పరుగులు సమర్పించుకున్న పాకిస్థాన్ ప్లేయర్లపై మీమ్స్, ట్రోల్స్ పేలుతున్నాయి. 

5 runs off a single ball without a boundary: మెల్బోర్న్ ఎంసీజీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఆట తీరుపై ముఖ్యంగా ఆ జ‌ట్టు ఫీల్డింగ్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మైదానంలో ఆ జట్టు ప్రదర్శన విమర్శలకు తావిస్తోంది. తాజాగా షాహీన్ అఫ్రిదికి సంబంధించిన సంఘటన విమర్శలను మరింత తీవ్రతరం చేసింది. బౌండరీలు, నో బాల్స్ లేకుండా ఒకే బంతికి ఐదు పరుగులు స‌మ‌ర్పించుకుంది పాకిస్థాన్. దీంతో పాక్ ఆట‌గాళ్ల ఫీల్డింగ్ పై విమ‌ర్శ‌లు, ట్రోల్స్ హోరెత్తుతున్నాయి.

సెంకండ్ ఇన్నింగ్స్ 75వ ఓవ‌ర్ లో ఆసీస్ బ్యాట‌ర్ ప్యాట్ క‌మిన్స్ ఒకే బంతికి ఐదు ప‌రుగులు చేశాడు. అది కూడా బౌండ‌రీ, నో బాల్ లేకుండానే ! ప్యాట్ క‌మిన్స్ బ్యాటింగ్ చేస్తుండ‌గా, పాక్ బౌల‌ర్ ఆమిర్ జమాల్ బౌలింగ్ చేశాడు. ఈ బంతికి మొద‌ట రెండు ప‌రుగులు చేశారు కంగారు ప్లేయ‌ర్స్. ఈ క్ర‌మంలోనే ఫీల్డ‌ర్ బంతిని వికెట్ల వైపు విసిరాడు. త్రోను ప‌ట్టుకోవ‌డానికి వ‌చ్చిన షాహీన్ అఫ్రిది బంతిని పూర్తిగా మిస్సయ్యాడు. బౌండరీ ముందు బంతిని ఆపాలని ఇమామ్ ఉల్ హక్ పట్టుదలతో పరుగులు చేసినప్పటికీ కమిన్స్, అలెక్స్ క్యారీ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం ద్వారా ఐదు పరుగులు పూర్తి చేయగలిగారు.

Scroll to load tweet…

ఇప్ప‌టికే చెత్త ఫీల్డింగ్ అంటూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న పాక్.. తాజా ఘ‌ట‌న‌తో మ‌రోసారి పాకిస్థాన్ జ‌ట్టు ఫీల్డింగ్ లో చెత్త అని నిరూపించుకుంద‌ని నెట్టింట విమ‌ర్శ‌లు, ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఈ ఫీల్డింగ్ లోపం పాకిస్థాన్ కు కీలకమైన పరుగులను కోల్పోవడమే కాకుండా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది, అంతర్జాతీయ స్థాయిలో వారి ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను ఎత్తిచూపింది.

146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క‌డు.. ! విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు