146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. ! విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు
Virat Kohli Achieves Rare Record: దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయినప్పటికీ, విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నమోదుచేసి అంతర్జాతీయ క్రికెట్ లో తన అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటిగా చరిత్ర లిఖించాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్ మన్ కు సాధ్యం కాని రికార్డును సృష్టించాడు.
Virat Kohli
Virat Kohli Rare Batting Record: ఇప్పటివరకు ఏ క్రికెటర్ సాధించని మరో రికార్డును విరాట్ కోహ్లీ సాధించాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల ఘోరంగా ఓడిపోయింది. కానీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో విరాట్ 76 పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేసి 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చేయని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Image credit: PTI
సెంచూరియన్ టెస్టులో కోహ్లీ చేసిన పరుగులు 2023లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులు దాటాయి. ఒక క్యాలెండర్ ఇయర్ లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడం కోహ్లీకి ఇది ఏడోసారి. అంటే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ విరాట్ కోహ్లీ.
2023లో కోహ్లీ 35 మ్యాచ్ లను ఆడి 2048 పరుగులు చేశాడు. 2023లో అత్యధిక పరుగులు (2156) చేసిన బ్యాటర్ గా శుభ్ మన్ గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే, కోహ్లీ కంటే ఎక్కువగా 48 మ్యాచ్ లను ఆడి ఈ పరుగులు చేశాడు. ఈ లిస్టులో ఉన్న మూడో ప్లేయర్ డారిల్ మిచెల్ 2023లో ఇప్పటివరకు 49 మ్యాచ్ లలో 1970 పరుగులు చేశాడు.
Image credit: Getty
ఇక విరాట్ కోహ్లీ వేరువేరు ఏడు క్యాలెండర్ ఇయర్లలో 2 వేలకు పైగా పరుగులు సాధించిన మొదటి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో 2012 (2186 పరుగులు), 2014 (2286 పరుగులు), 2016 (2595 పరుగులు), 2017 (2818 పరుగులు), 2018 (2735 పరుగులు), 2019 (2455)లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల ఫీట్ సాధించాడు. 1877లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి నుంచి (అధికారిక రికార్డు ప్రకారం) మరే ప్లేయర్ ఈ ఘనత సాధించలేదు.
Image credit: PTI
ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో విరాట్ లో కోహ్లీ అనేక రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా టెస్టులో చేసిన పరుగులతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా నిలిచాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీలు తర్వాతి స్థానంలో ఉన్నారు.