Asianet News TeluguAsianet News Telugu

రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా పై తండ్రి షాకింగ్ కామెంట్స్..

Ravindra Jadeja Father: భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఆయ‌న తండ్రి అనిరుధ్ సిన్హ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జడేజా, అతని భార్య రివాబాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తీవ్రంగా స్పందించారు. 
 

Ravindra Jadeja Father Anirudhsinh's shocking comments on Jadeja and his wife Rivaba  RMA
Author
First Published Feb 9, 2024, 6:05 PM IST | Last Updated Feb 9, 2024, 6:05 PM IST

Ravindra Jadeja Father shocking comments: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై ఆయన తండ్రి అనిరుధ్ సిన్హ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జడేజాతో పాటు ఆయన భార్య రివాబా జ‌డేజాపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. కొడుకు ర‌వీంద్ర జ‌డేజా, కోడ‌లు రివాబా జ‌డేజాల‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అనిరుధ్ సిన్హ్ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. 2016లో రవీంద్ర జడేజా ఇంజినీరింగ్ విద్యార్థి అయిన రివాబాతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ త‌ర్వాత రెండు నెల‌ల‌కు వీరి వివాహం జ‌రిగింది. ఈ పెళ్లి తర్వాత త‌న కొడుకు ర‌వీంద్ర జ‌డేజా, కొడ‌లు రివాబాల‌తో సంబంధాలు పూర్తిగా చెడిపోయాయ‌ని అనిరుధ్ సిన్హ్ పేర్కొన్నారు.

"నిజం చెప్పాలంటే, రవీంద్ర జడేజాతో పాటు అత‌ని భార్య రివాబా జడేజాల‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వారికి కాల్ చేయను.. వారు కూడా నాకు కాల్ చేయరు. ఇలా మా మ‌ధ్య సంబంధాలు తెగిపోవ‌డం ర‌వీంద్ర జ‌డేజా వివాహం జ‌రిగిన రెండు మూడు నెల‌ల‌కే జ‌రిగిపోయింది" అని అనిరుధ్ సిన్హ్ పేర్కొన్నారు. అలాగే, తాను జామ్‌నగర్‌లో ఒంటరిగా ఉంటున్నాన‌నీ, రవీంద్ర జడేజా కూడా అదే నగరంలోని బంగ్లాలో విడివిడిగా ఉంటున్నార‌ని తెలిపారు. "మేము ఒకే నగరంలో నివసిస్తున్నప్పటికీ, మేము ఒకరినొకరు చూడలేము, నా కొడుకు కోసం అతని భార్య ఏమి మాయాజాలం చేసిందో నాకు తెలియదు.. మొత్తానికి ఇలా జ‌రిగిపోయింది" అని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ్ దైనిక్ భాస్కర్‌కి ఇచ్చిన‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రోహిత్ శ‌ర్మ‌-హార్దిక్ పాండ్యాల‌ మ‌ధ్య ముంబై చిచ్చు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో.. !

రివాబా త‌మ కుటుంబంలో చిచ్చుపెట్టింద‌ని పేర్కొన్నాడు. జ‌డేజా క్రికెట‌ర్ గా మార‌కుండా ఉండివుంటే ఎప్పటికీ ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చివుండేది కాద‌ని అనిరుధ్ సిన్హ్ తెలిపారు. "పెళ్లయిన మూడు నెలల్లోనే అన్నీ త‌న పేరుతో మార్చుకోవాలని.. మా కుటుంబంలో చీలిక తెచ్చింది. ఏదీ దాచడం ఇష్టం లేదు నాకు.. గత ఐదేళ్లుగా మనవరాలిని కూడా చూడలేకపోతున్నాను. దీనికి రవీంద్ర జడేజా భార్య అడ్డుప‌డుతోంది. కేవ‌లం డబ్బు కోస‌మే నా కొడుకు ర‌వీంద్ర జ‌డేజాను రివాబా పెళ్లి చేసుకుంది" అంటూ అనిరుధ్ సిన్హ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

David Warner: మూడు ఫార్మాట్ల‌లో సెంచరీ .. 3వ క్రికెట‌ర్‌గా వార్న‌ర్ భాయ్ స‌రికొత్త‌ రికార్డు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios