సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు.. కొట్టింది మాత్రం పాక్ ప్లేయర్ !
Sachin Tendulkar: అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు చాలా కొత్త రికార్డులను సచిన్ టెండూల్కర్ సృష్టించాడు. అయితే, సచిన్ నుంచి గిఫ్ట్ గా అందుకున్న బ్యాట్ తో పాకిస్తాన్ ప్లేయర్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో పరుగుల వరద పారించాడు.
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్లేయర్లకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ ప్లేయర్. ప్రపంచ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో "గాడ్ ఆఫ్ క్రికెట్" గా గుర్తింపు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి దాదాపు 11 సంవత్సరాలకు పైగా అవుతోంది. అయితే, ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ క్రికెట్ రారాజుగా కొనసాగుతున్నాడు. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ను శాసించిన సచిన్ అనేక రికార్డులు సృష్టించాడు.
ఉన్నతమైన వ్యక్తిత్వంతో క్రికెట్ లో గొప్ప పేరు సంపాదించాడు. అందుకే ప్రత్యర్థి జట్లకు సైతం సచిన్ అంటే ఇష్టం. అతని ఆట అంటే ఇష్టం. వీరిలో పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇదిలావుండగా, సచిట్ టెండూల్కర్ బ్యాట్ తో ఒక పాక్ ప్లేయర్ విధ్వంసం సృష్టించాడు. గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తూ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతనే షాహిద్ ఆఫ్రిది. పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడికి మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్ గొప్ప రక్షకునిగా నిలిచిన సందర్భం అది.
1996లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు భారీ స్కోరు దిశగా ముందుకు సాగింది. ఓపెనర్ సయీద్ అన్వర్ 115 పరుగులు చేసి జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలోనే క్రీజులో ఉన్న షాహిద్ అఫ్రిదీకి అతని బ్యాట్‌లో సమస్య వచ్చింది. దీంతో షాహిత్ అఫ్రిది సచిన్ టెండూల్కర్ నుంచి బహుమతిగా అందుకున్న బ్యాట్ తో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. శ్రీలంకపై షాహిద్ అఫ్రిది మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి.. ఏ మాత్రం కనికరం లేకుండా బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
ఆఫ్రిది తన ఇన్నింగ్స్‌లో 11 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అప్పట్లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. మొత్తంగా 40 బంతుల్లో 102 పరుగుల చేయడంతో పాక్ జట్టు స్కోరు 371 పరుగులకు చేరింది. ఈ సెంచరీ రికార్డు18 ఏళ్లుగా చెక్కుచెదరలేదు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 2014లో న్యూజిలాండ్ లెజెండ్ కోరీ అండర్సన్ వెస్టిండీస్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసి షాహిద్ అఫ్రిది రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. అతను కేవలం 31 బంతుల్లోనే సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు.
శిఖర్ ధావన్ టాప్-10 వన్డే రికార్డులు ఇవే
- Bharat
- Cricket Intresting Story
- Cricket News
- Pakistan
- Sachin Tendulkar
- Sachin Tendulkar gifted bat
- Shahid Afridi
- Shahid Afridi record sachin Tendulkar bat
- Shahid afridi fastest ODI Century
- Sri Lanka
- Tendulkar
- cricket
- cricket records
- cricket story
- fastest century
- fastest century in odi cricket
- fastest century record