బుమ్రా కంటే ఎక్కువ‌ వేగం.. ఈ భార‌త బౌల‌ర్ తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లే.. రాబోయే సిరీస్ కు ఛాన్స్ ఇస్తారా?

Team India : భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీని బీసీసీఐ నిర్వ‌హిస్తోంది. మొత్తం 4 జట్లు  పాల్గొంటున్న ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన భార‌త జ‌ట్టులోకి రావాల‌ని చాలా మంది క్రికెట‌ర్లు చూస్తున్నారు.

More speed than Jasprit Bumrah.. It will be difficult for the rival teams with this Indian bowler. Will you give the upcoming series a chance? RMA

Team India: సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఈ సిరీస్‌లో ఆడటం కష్టమే. పనిభారం నిర్వహణలో బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే అవ‌కాశ‌ముంది. అలాగే, వన్డే ప్రపంచకప్‌ నుంచి షమీ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇంకా పూర్తి ఫిట్‌గా లేడు. షమీ ప్ర‌స్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ పొందుతున్నాడు. కాబ‌ట్టి బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు దూరంగా ఉంచే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. 

భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఇందులో 4 జట్లు పాల్గొంటాయి. దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసి భార‌త జ‌ట్టులోకి మ‌ళ్లీ ఎంట్రీ ఇవ్వాల‌ని చాలా మంది ప్లేయ‌ర్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. కొంతమంది ఆటగాళ్లు టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని కోరుకుంటున్నారు. వారిలో ఉమ్రాన్ మాలిక్ ఒకరు. స్పీడ్‌లో భారత టాప్ బౌల‌ర్ల‌లో ఒక‌రైన ఉమ్రాన్ చాలా కాలంగా గాయాల‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవ‌లే కోలుకున్న అత‌ను మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. 

డెంగ్యూ నుంచి కోలుకున్న ఉమ్రాన్ మాలిక్ దులీప్ ట్రోఫీపై దృష్టి సారించాడు. దులీప్ ట్రోఫీ 2024 సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం (ఆంధ్రప్రదేశ్), ఎం చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)లో ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్, రీతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్ తదితరులతో పాటు ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్ సీలో ఉంచారు. 24 ఏళ్ల ఉమ్రాన్ దేశవాళీ టోర్నమెంట్ గురించి మాట్లాడుతూ.. తన జట్టుకు మంచి ప్రదర్శన ఇస్తానని ధీమా వ్య‌క్తం చేశాడు. 

ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం తాను ఫిట్ గా ఉన్నాన‌నీ, రాబోయే దులీప్ ట్రోఫీపై పూర్తి దృష్టితో ఉన్నాన‌ని అన్నాడు. ఈ సీజన్‌లో తాను త‌న జట్టు కోసం బాగా రాణిస్తాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఉమ్రాన్ మ‌లిక్ కెరీర్ గ‌మ‌నిస్తే.. ఐపీఎల్ 2024లో మాలిక్ ఒకే ఒక్క మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఒక్క ఓవర్లో 15 పరుగులు ఇచ్చాడు. 24 ఏళ్ల ఉమ్రాన్ భారత్ తరఫున 10 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను మొత్తం 24 వికెట్లు తీశాడు. ఉమ్రాన్ 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. దులీప్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాడు. మంచి వేగంతో బంతులు వేసే ఈ బౌలర్ భారత జట్టులోకి తిరిగి రావడంపైనే దృష్టి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios