Cricket

Shikhar Dhawan: శిఖర్ ధావన్ టాప్-10 వన్డే రికార్డులు ఇవే

శిఖర్ ధావన్ కెరీర్

భారత క్రికెట్ స్టార్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 'గబ్బర్' అనే ముద్దు పేరుతో పాపులర్ అయిన ధావన్ తన కెరీర్‌లో అనేక వన్డే రికార్డులు సృష్టించాడు.

క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు

ధావన్ ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా పలుమార్లు నిలిచాడు. ఇది వన్డేల్లో అతని స్థిరత్వాన్నిచూపిస్తుంది.

టెస్ట్ అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ

2013లో ఆస్ట్రేలియాపై ధావన్ తన టెస్ట్ అరంగేట్రంలో 85 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు

2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. అలాగే, ఈ టోర్నీని భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

100వ వన్డేలో సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు

2018లో దక్షిణాఫ్రికాపై తన 100వ వన్డేలో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా ధావన్ చరిత్ర సృష్టించాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు, సెంచరీలు

44.11 సగటుతో ధావన్ వన్డేల్లో 6,700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 17 సెంచరీలు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 143.

వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు

ధావన్ వన్డేల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు 39 సార్లు సాధించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ రికార్డు కలిగి ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక స్కోరు

శిఖర్ ధావన్ వన్డేల్లో 842 ఫోర్లు బాదాడు. ధావన్ వన్డేల్లో అత్యధిక స్కోరు 143. ధావన్ వన్డేల్లో సగటు 44.11.

టెస్ట్‌లో తొలి రోజు లంచ్‌కు ముందే సెంచరీ

2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు లంచ్‌కు ముందే శతకం సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా ధావన్ ఘనత సాధించాడు. 

ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

రోహిత్ శర్మకు ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

అంబానీ ప్రీ వెడ్డింగ్ లో స్టైలిష్ లుక్ లో భార‌త క్రీడా తారలు !

కొలంబో నుంచి దంబుల్లాకి ఆసియా కప్ 2023 మ్యాచులు!