భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ నియంత్రాణ మండలి అధ్యక్షుడిగా గంగూలీ ఏదో ఒక రోజున ఎన్నికవుతారని తాను 2007లోనే అనుకున్నానని సెహ్వాగ్ తెలిపాడు.

అలాగే దాదా ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతారని వీరేంద్రుడు అభిప్రాయపడ్డాడు. ఈ నెల 23వ తేదీన బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సెహ్వాగ్ స్పందిస్తూ దాదా ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలిసి 2007లో జరిగిన ఓ ఘటన నాకు గుర్తుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో జరుగుతున్న ఓ టెస్ట్ మ్యాచ్‌లో తాను.. వసీం జాఫర్ త్వరగా పెవిలియన్‌ చేరుకున్నామని.. అయితే సచిన్ అప్పటికి బ్యాటింగ్‌కు వెళ్లే పరిస్థితి లేదన్నాడు.

Also Read:గంగూలీ మార్క్: ఇక డే అండ్ నైట్ టెస్ట్, ఈడెన్ గార్డెన్ లో తొలి మ్యాచ్

దీంతో గంగూలీ బ్యాటింగ్‌కు వెళ్లాడని.. అయితే ఆ సమయంలో దాదా అద్భుతమైన ప్రదర్శన చేశాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ సిరీస్‌ తమకు ఎంతో కీలకమని.. అలాంటి ఇన్నింగ్స్‌ ఆయనకు ఒక్కడికే సాధ్యమవుతుందని వీరేంద్రుడు తెలిపాడు.

తమలో ఎప్పటికైనా బీసీసీఐ అధ్యక్షుడయ్యే అర్హత ఉందంటే అది గంగూలీ ఒక్కడికేనని తాను డ్రెస్సింగ్‌ రూమ్‌లో చెప్పగా అందుకు అందరూ అంగీకరించామని నాటి జ్ఞాపకాలను ఈ డాషింగ్ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు. ఒక విషయం నిజమైంది.. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సి ఉందని సెహ్వాగ్ వివరించాడు.

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో ఆయన సమావేశమయ్యారు. భారతదేశంలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలను దాదా ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం బంగ్లాదేశ్‌తో త్వరలో జరిగపే టీ20, టెస్ట్ సిరీస్‌‌ల కోసం జట్లను ప్రకటించారు. 

Also Read:షాక్ తిన్నా: బీసీసీఐ చీఫ్ గంగూలీ గదిపై వీవీయస్ లక్ష్మణ్ వ్యాఖ్య

భారత క్రికెట్ నియంత్రణా మండలి నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గంగూలీని నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సుప్రీంకోర్టు నియమించిన సీఓఏ కమిటీ బాధ్యతల నుంచి తప్పుకుని.. గంగూలీకి బోర్డు పగ్గాలు అప్పగించింది. దాదాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా , అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ ట్రెజరర్‌గా బాధ్యతలు చేపట్టారు.