ప్రధాని నరేంద్రమోడీకి టీమిండియా మాజీ కెప్టెన్, లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ప్రధాని మోడీ ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులతో ‘‘పరీక్షా పే చర్చా’’ కార్యక్రమంలో పాల్గొని ఆత్మ విశ్వాసాన్ని పెంచే సూచనలు చేశారు.

Also Read:మ్యాచ్‌ మధ్యలో పరస్త్రీపై ముద్దుల వర్షం : భార్యను మోసం చేశానంటూ పోస్ట్

ఇదే సమయంలో అనిల్ కుంబ్లే పేరును ప్రస్తావించారు. 2002లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ తీవ్ర గాయాన్ని సైతం లెక్కచేయకుండా కుంబ్లే దేశం కోసం ఆటను కొనసాగించారని విద్యార్ధులకు చెప్పారు.

దీనిపై స్పందించిన కుంబ్లే.. ప్రధాని స్థాయి వ్యక్తి విద్యార్థులకు తన గురించి చెప్పడం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. మోడీకి థాంక్స్ చెబుతూ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Also Read:28 వరకే గడువు, లేదంటే నాకు రుణపడతావ్: కాంబ్లీకి సచిన్ సవాల్

కాగా 2002లో భారత్-వెస్టిండీస్‌ల మధ్య అంటిగ్వా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కుంబ్లే దవడకు గాయమైంది. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతనిని జట్టు నుంచి తప్పించాలని అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బ్యాండేజ్‌తోనే కుంబ్లే బౌలింగ్ చేస్తున్న ఫోటో క్రికెట్ అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది.