టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా ఉండటానికి తాను ఇష్టపడతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. తాను దూకుడుగా, వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్లను తీర్చిదిద్దగలనని వెల్లడించాడు.

సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ హలోలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అక్తర్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. తన పనే జ్ఞానాన్ని పంచడం, తాను నేర్చుకున్నది ఇతరులకు పంచుతా.. ఇప్పుడు ఉన్న వారి కంటే ఎక్కువ దూకుడుగా, వేగంగా ఆడేలా తీర్చిదిద్దుతానని షోయబ్ అక్తర్ స్పష్టం చేశాడు.

Also Read:కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం: అమరులకు కోహ్లీ నివాళి

తన మెళకువలను జూనియర్లకు పంచిపెట్టాలని కోరుకుంటానని, దూకుడుగా ఆడే బౌలర్లను తయారు చేయాలనే చూస్తానని వెల్లడించాడు. ముఖ్యంగా ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్ వ్యవహరించాలని ఉందని అక్తర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

అలాగే టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌ గురించి తన అభిప్రాయాలను అక్తర్ పంచుకున్నాడు. తాను అంతకు ముందే సచిన్‌ను చూశాను.. కానీ భారత్‌లో అతడికున్న ఫాలోయింగ్ గురించి అప్పటికి తెలిదు.

Also Read:పెళ్లై పిల్లలున్న పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లా..?

1998లో జరిగిన సిరీస్‌‌లో భాగంగా భారత్‌కు వచ్చినప్పుడు అతడిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తారని తెలుసుకున్నట్లు అక్తర్ చెప్పాడు. అతను మంచి ఫ్రెండ్ కూడా అని నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు. దీనితో పాటు భారతదేశంలో తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.