జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన సైనికులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నివాళి ఆర్పించాడు.

క్లిష్ట పరిస్ధితుల్లోనూ విధులను మరచిపోనివారే నిజమైన హీరోలు. వారి త్యాగం మర్చిపోవద్దు.. హంద్వారాలో ప్రాణత్యాగం చేసిన జవాన్లు, పోలీసులకు తాను తలవంచి వందనం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. జైహింద్ అని విరాట్ సోమవాం ట్వీట్  చేశాడు.

Also Read:అసోంలో ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ: ఇది కూడ చైనా నుంచే...

కాగా జమ్మూకాశ్మీర్‌లోని హంద్వారా మండలంలోని రజ్వార్‌ అటవీ ప్రాంతంలో ఒక గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో సైన్యంలోని 21వ రాష్ట్రీయ రైఫిల్స్ దళ కమాండింగ్ అధికారి కల్నల్ అశుతోష్ నేతృత్వంలోని బృందం, జమ్మూకాశ్మీర్ పోలీసులు, పారామిలటరీ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య సుమారు 16 గంటల పాటు భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో కల్నల్ అశుతోష్, ఒక మేజర్, ఇద్దరు సైనికులు, జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఓ ఎస్సై అమరులయ్యారు.

Also Read:లాక్ డౌన్ ఎత్తివేత.. సరి, బేసి విధానం అమలు?

ఘటనాస్థలంలో ఉగ్రవాదులు బంధించిన పౌరులను రక్షించే క్రమంలో వీరు వీరమరణం పొందారు. ఇంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను సైనిక కమాండోలు మట్టుబెట్టారు. అమరవీరులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.