Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ vs పాకిస్థాన్ మ్యాచ్ లో డ‌బుల్ డోస్ ఉత్కంఠ‌.. 6 ప‌రుగుల తేడాతో రోహిత్ సేన థ్రిల్లింగ్ విక్టరీ

T20 World Cup 2024, IND vs PAK: భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డబుల్ డోస్ ఉత్కంఠ కనిపించింది. మ్యాచ్ మొత్తంలో పాకిస్థాన్ పైచేయి క‌నిపించినా.. మ్యాచ్ చివరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. బుమ్రా బ్రేక్ త్రూ అందిస్తూ భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. 
 

Double dose of excitement in India vs Pakistan match .. Rohit Sharma's team's thrilling victory of 6 runs T20 World Cup 2024, IND vs PAK RMA
Author
First Published Jun 10, 2024, 2:53 AM IST

T20 World Cup 2024, IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్ జట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో భార‌త ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మలు పెద్ద ఇన్నింగ్స్ ను ఆడ‌లేక‌పోయారు. రిష‌బ్ పంత్ మిన‌హా ఇత‌ర ప్లేయ‌ర్లు ఏవ‌రూ రాణించ‌లేక‌పోవ‌డంతో భార‌త్ 119 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 120 ప‌రుగుల టార్గెట్ ఛేద‌న‌లో పాకిస్తాన్ మ్యాచ్ మొత్తం పూర్తిగా అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించినా.. చివ‌రి ఓవ‌ర్ల‌ల‌లో భార‌త బౌల‌ర్లు అద్భుతం చేశారు. జ‌స్ప్రీత్ బుమ్రా సూప‌ర్ బౌలింగ్ తో భార‌త్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. ఐసీసీ మెగా టోర్నీలో భార‌త్ మ‌రోసారి పాకిస్తాన్ పై తన అధిప‌త్యం చూపించింది.

చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌.. థ్రిల్లింగ్ విక్ట‌రీ..

భారత్ - పాకిస్తాన్ మధ్య తక్కువ స్కోరింగ్ థ్రిల్లర్‌లో మూడవ డోస్ థ్రిల్ కనిపించింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌, ఆ తర్వాత వికెట్లు తీసి ఘనంగా సంబరాలు చేసుకుంది. భారత్ బ్యాటింగ్ లో దారుణంగా విఫ‌ల‌మైంది. అయితే మ్యాచ్ చివరి 5 ఓవర్లలో మ్యాచ్ ను భార‌త బౌల‌ర్లు మ‌లుపుతిప్పారు. చివరికి న్యూయార్క్‌లో భారత జట్టు 6 పరుగుల తేడాతో గెలుపొందడంతో టీమ్ ఇండియా పైచేయి సాధించింది. రోహిత్‌-కోహ్లీ లాంటి దిగ్గజాలు ఫ్లాప్‌గా అనిపించినా..రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ భార‌త్ గెలుపులో కీల‌కంగా ఉన్న‌ది. పంత్ 42 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియా పరువు కాపాడాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత జట్టు 119 పరుగులకు చేరుకోగలిగింది. పాక్‌ తరఫున రౌఫ్‌, నసీమ్ మూడేసి వికెట్లు తీశారు. అమీర్‌కు 2 వికెట్లు దక్కాయి.

120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ కు మంచి శుభారంభం ల‌భించింది. పాకిస్థాన్ కు ఓపెన‌ర్లు ఇద్ద‌రు 57 పరుగుల భాగ‌స్వామ్యం అందించారు. పాకిస్థాన్ 15 ఓవర్ల వరకు మ్యాచ్ ను పూర్తిగా త‌న వైపు మాత్ర‌మే ఉంచుకుంది. పాకిస్తాన్ గెల‌వ‌డం దాదాపు ఖాయం అనుకునే స‌మ‌యంలో.. చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో భార‌త బౌల‌ర్లు అద్భుతం చేశారు. బుమ్రా సూప‌ర్ బౌలింగ్ తో మూడు వికెట్లు తీసుకుని పాక్ ఓట‌మికి కార‌ణం అయ్యాడు. అలాగే, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ ప‌టేల్, అర్ష్ దీప్ సింగ్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

 

 

IND vs PAK : భార‌త్-పాకిస్తాన్.. మనల్ని ఆపేది ఎవడ్రా.. ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios