ధోనీకి క్షమాపణలు చెప్పిన దినేష్ కార్తీక్.. ఏం జరిగిందంటే?
Dinesh Karthik apologises to MS Dhoni: టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి క్షమాపణలు చెప్పాడు. వీరిద్దరూ కలిసి భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు డీకే ఎందుకు క్షమాపణలు చెప్పాడు?
Dinesh Karthik apologises to MS Dhoni: మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ తన ఆల్‌టైం ఇండియా 11 ప్రకటించాడు. అయితే, భారత క్రికెట్ జట్టు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ గా నిలబెట్టిన ఎంఎస్ ధోనికి మాత్రం ఇందులో చోటఇవ్వలేదు. కార్తీక్ తన ఆల్ టైం ఇండియా ప్లేయింగ్ 11 ఏ జట్టులో కూడా ధోనికి స్థానం కల్పించలేదు. దీంతో క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ధోని అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ క్షమాపణలు చెప్పాడు. ధోని లాంటి లెజెండ్ ను తన ప్లేయింగ్ 11 లో చేర్చడం మర్చిపోయానని పేర్కొన్నాడు. తన లైనప్ లో వికెట్ కీపర్ ను ఎంచుకోలేదని చెప్పాడు.
తన జట్టు ఎంపిక గురించి మీడియాలో ఎపిసోడ్ ప్రసారం తర్వాత తన తప్పును అంగీకరిస్తూ "భాయ్ లోగ్, బడా గల్తీ హో గయా (అబ్బాయిలు, నేను పెద్ద తప్పు చేశాను)" అని పేర్కొన్నాడు. దానిని ఎపిసోడ్ ప్రసారం అయిన తర్వాతే తాను గుర్తించానని తెలిపాడు.
సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు.. కొట్టింది మాత్రం పాక్ ప్లేయర్ !
భారత్ తరపున వికెట్ కీపర్‌గా వ్యవహరించిన కార్తీక్.. భారత గోప్ప క్రికెటర్లలో ధోని ఒకరని ప్రశంసలు కురిపించాడు. తన పట్ల ఎప్పుడు గొప్ప గౌరవం ఉంటుందని తెలిపాడు. మళ్లీ తాను జట్టుకు ఎంపిక చేస్తే ధోనికి 7వ నంబర్ స్పాట్ ఇవ్వడంతో పాటు కెప్టెన్సీ కూడా అతనికే ఇస్తానని చెప్పాడు. కాగా, కార్తీక్ మొదట ఎంపిక చేసిన ఆల్‌టైం ఇండియా XIలో అన్ని ఫార్మాట్లలో దేశంలోని టాప్ ప్లేయర్ల మిశ్రమంతో ఉంది. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జంటగా, తర్వాత కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ లను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో విరాట్ కోహ్లీని ఉంచాడు. ఆల్ రౌండర్లలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. వీరిద్దరూ బ్యాట్, బాల్ తో భారత్ కు అనేక విజయాలు అందించిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేలు ఉన్నారు.పేస్ అటాక్ లో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ ఉన్నారు. హర్భజన్ సింగ్ గొప్ప ప్లేయర్ గా పేర్కొంటూ అతన్ని 12వ ప్లేయర్ గా ఎంపిక చేశాడు.