IPL 2024 : మ్యాచ్ బాల్‌ను దొంగిలించిన కేకేఆర్ ఫ్యాన్.. చివరకు.. వీడియో
KKR : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వర్షం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండా రద్దు అయింది. అయితే, కేకేఆర్ ఫ్యాన్ చేసిన ఓ పని వీడియో వైరల్ గా మారింది.
Kolkata Knight Riders fan : ఐపీఎల్ 2024 వైరల్ లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే కురుస్తున్న వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు చేయబడింది. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. దీంతో కోల్ కతా 13 మ్యాచ్ ల్లో 19 పాయింట్లకు చేరుకుంది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్-2తో లీగ్ రౌండ్‌ను ముగించనుంది. మరోవైపు మ్యాచ్ రద్దుతో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ ప్లేఆఫ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. జట్టు అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. 13 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లు సాధించింది.
బాల్ దొంగిలించిన కేకేఆర్ ప్యాన్.. వీడియో వైరల్
ఈ మ్యాచ్ కు ముందు, కోల్‌కతా జట్టు తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ముంబైతో తలపడింది. ఆ మ్యాచ్‌లోనూ వర్షం కురిసింది. ఈ కారణంగా మ్యాచ్ 16-16 ఓవర్ల వరకు జరిగింది. కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఒక అభిమాని మ్యాచ్ బంతిని దొంగిలించడానికి ప్రయత్నించాడు. కేకేఆర్ జెర్సీని ధరించిన ఆ యువ అభిమాని తన జేబులో మ్యాచ్ బాల్‌తో స్టేడియం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. మొదట బంతిని కూడా పోలీసులకు ఇవ్వలేదు. అయితే, అతన్ని మందలించడం విని పోలీసులకు బంతిని ఇచ్చాడు. తర్వాత పోలీసు మైదానంలో బంతిని విసిరాడు. దీని తర్వాత పోలీసులు ఆ యువకుడిని స్టేడియం బయటకు పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్ లో కోల్‌కతా గెలుపు..
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. నితీష్ రాణా 23 బంతుల్లో 33 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 14 బంతుల్లో 24 పరుగులు చేశారు. రింకూ సింగ్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. రమణదీప్ సింగ్ 8 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై తరఫున జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీశారు. 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టు 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 40 పరుగులు, తిలక్ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు చేశారు. 24 బంతుల్లో 19 పరుగులు చేసి రోహిత్ శర్మ, 14 బంతుల్లో 11 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ కీలక సమయంలో నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు.
హార్దిక్ పాండ్యాకు అండగా.. డివిలియర్స్, పీటర్సన్ కు క్లాస్ పీకిన గౌతమ్ గంభీర్