DC vs GT: అదరగొట్టిన బౌలర్లు.. గుజరాత్‌ను చిత్తుచేసిన ఢిల్లీ..
Delhi Capitals vs Gujarat Titans: ఐపీఎల్ 2024 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బౌలర్లు అదరగొట్టారు.
Tata IPL 2024, GT vs DC : ఐపీఎల్ 2024 లో ఇప్పటివరకు సాగిన మ్యాచ్ లలో బ్యాటర్స్ హవా కొనసాగింది. అయితే, ఐపీఎల్ 2024 32వ మ్యాచ్‌లో మాత్రం బౌలర్లు దుమ్మురేపారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. గుజరాత్ వరుసగా రెండో విజయంపై కన్నేయగా ఢిల్లీ షాక్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ఇప్పుడు ఢిల్లీ చేతితో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఏడు మ్యాచ్‌ల్లో గుజరాత్‌కు ఇది నాలుగో ఓటమి కాగా, 3వ విజయం. గుజరాత్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది. 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లోనూ ఢిల్లీ విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
ఏం కొట్టాడు భయ్యా.. నరైన్ మామా దెబ్బకు స్టేడియం షేక్ అయింది.. !
ఈ మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ జట్టు 17.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీకి 90 పరుగుల లక్ష్యాన్ని అందజేసింది. కేవలం 53 బంతుల్లోనే టార్గెట్ ను చేధించింది. ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయం సాధించింది. రిషబ్ పంత్ 11 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, సుమిత్ కుమార్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
అదరగొట్టిన బౌలర్లు.. ఈ సీజన్ లో అత్యల్ప స్కోర్..
ఢిల్లీ బౌలర్లలు తమ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ కు ఓటమి తప్పలేదు. ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ట్రిస్టర్ స్టబ్స్ సూపర్ బౌలింగ్ తో అదరగొట్టారు. ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, ట్రిస్టన్ స్టబ్స్ 2 వికెట్లు తీసుకున్నారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ లు చెరో వికెట్ తీసుకున్నాడు. దీంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారు పెద్దగా పరుగులు సాధించలేకపోయారు.
90 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 20 పరుగులు, పోరెల్ 15, షాయ్ హోప్ 19, రిషబ్ పంత్ 16 పరుగులు కొట్టారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 ఓవర్లలో 2 వికెట్లు తీసుకున్నాడు. స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ లు చెరో వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు.
KKR vs RR Highlights : ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిపడేసిన జోస్ బట్లర్..