రాజ్ కోట్: ఇండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన వార్నర్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని అవుట్ కు కారణం మనీష్ పాండే అద్భుతమైన క్యాచ్. 

మొహమ్మద్ షమీ వేసిన నాలుగో ఓవర్ రెండో బంచతచిని వార్నర్ ఆఫ్ సైడ్ కు హిట్ చేశాడు. మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే దాన్ని అద్భుతంగా గాలిలోనే అందుకున్నాడు. బంతి వేగాన్ని అంచనా వేసిన మనీష్ పాండే ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. 

Also Read: కోహ్లీ బ్యాడ్ లక్: బౌండరీ అవతలి బంతి అగర్ చేతిలోకి, ఆ తర్వాత...

ఆ క్యాచ్ కు డేవిడ్ వార్నర్ షాక్ తిన్నాడు. ఫోర్ వెళ్తుందని భావించిన ఆ బంతి క్యాచ్ గా మనీష్ పాండే చేతుల్లోకి వెళ్లడంతో నిరుత్తరుడైన డేవిడ్ వార్నర్ కాసేపు అలాగే నిలుచుండిపోయాడు.

మనీష్ పాండే అసాధారణమైన క్యాచ్ కు భారత శిబిరంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి. వార్నర్ ఔట్ విషయంలో షమీ కన్నా మనీష్ పాండేకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. 

Also Read: ఆడమ్ జంపా: తొలి వన్డేలో కోహ్లీ, రెండో వన్డేలో రోహిత్ శర్మ

భారత్ ఆస్ట్రేలియా ముందు 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శిఖర్ ధావన్ 96 పరుగులు చేసి సెంచరీ మిస్సయ్యాడు. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ చివరలో చెలరేగిపోయి 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. 

Also Read: సచిన్, హషీం ఆమ్లా రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ