రాజ్ కోట్: ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది. అతను అవుటైన తీరును చూస్తే అలాగే అనిపిస్తోంది. సిక్స్ గా వెళ్లాల్సిన బంతి క్యాచ్ గా మారిపోయింది. అగర్ అద్భుతమైన విన్యాసం ద్వారా అది జరిగింది. 

తొలి వన్డేలో ఆడమ్ జంపా చేతిలో అవుటైన కోహ్లీ రెండో వన్డేలోనూ అతని బౌలింగులోనే వెనుదిరిగాడు. జంపా బౌలింగులో కోహ్లీ అవుట్ కావడం ఇది ఏడోసారి. జంపా బౌలింగులో మరే ఇతర బ్యాట్స్ మన్ కూడా ఇన్నిసార్లు అవుట్ కాలేదు. ఇదే రికార్డు.  

Also Read: ఆడమ్ జంపా: తొలి వన్డేలో కోహ్లీ, రెండో వన్డేలో రోహిత్ శర్మ

జంపా వేసిన బంతిని విరాట్ కోహ్లీ షాట్ కొట్టిన తీరు చూస్తే అది సిక్స్ కావడం ఖాయమని అనిపించింది. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అగర్ బౌండరీ లోపలి నుంచి బంతిని బౌండరీ లైన్ కు కాస్తా వెలుపల పట్టుకుని దాన్ని మరో ఫీల్డర్ చేతిలోకి విసిరేశాడు. 

తాను బౌండరీ లైన్ ను దాటక ముందే బంతిని అందుకుని దాన్ని స్టార్క్ కు అందించాడు. దాంతో కోహ్లీ పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో కోహ్లీ 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. 76 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అతను 78 పరుగులు చేశాడు.  

Also Read: సచిన్, హషీం ఆమ్లా రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ మూడు వేల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా మూడు వేల వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన 40వ జోడీగా నిలిచింది. భారత్ తరఫున 10వ జోడీ.