రాజ్ కోట్: ఆస్ట్రేలియా స్నిన్నర్ ఆడమ్ జంపాను ఎదుర్కోవడంలో ఇండియా ఆగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ కూడా తడబడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆడమ్ జంపా ప్రథమ శ్రేణి బౌలర్ అనే విషయాన్ని విరాట్ కోహ్లీ గుర్తించలేదని స్టీవ్ వా అన్నాడు. అందుకే విరాట్ కోహ్లీ వికెట్ పారేసుకున్నాడని కూడా చెప్పాడు. తొలి వన్డేలో ఆడమ్ జంపా బౌలింగులో విరాట్ కోహ్లీ అవుట్ కావడంపై ఆయన ఆ విధంగా అన్నాడు.

తాజాగా రెండో వన్డేలోనూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అదే అనుభవాన్ని ఆడమ్ జంపా రుచి చూపించాడు. జంపా వేసిన 14వ ఓవరు మూడో బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరుకున్నాడు. అదే ఓవరులో రోహిత్ శర్మ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికే అతను అవుటయ్యాడు. అయితే, విరాట్ కోహ్లీ ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు.

Also Read: మళ్లీ జాంప చేతిలోనే... 78 పరుగుల వద్ద కోహ్లీ అవుట్

జంపా వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయడానికి రోహిత్ శర్మ ప్రయత్నించాడు. అయితే అది ప్యాడ్లకు తాకింది. దాంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దానిపై రోహిత్ శర్మ రివ్యూకు వెళ్లాడు. కానీ అతని నిరాశే ఎదురైంది. బంతి వికెట్లను తాకుతున్నట్లు రిప్లేలో తేలడంతో రోహిత్ శర్మ మైదానం వీడాల్సి వచ్చింది. 

జంపా బౌలింగులో వన్డేలు, టీ20ల్లో కలిపి రోహిత్ శర్మ అవుట్ కావడం ఇది నాలుగోసారి. దాంతో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో అతను నిలిచాడు. జంపా బౌలింగులో వన్డేలు, టీ20ల్లో కలిపి విరాట్ కోహ్లీ ఆరు సార్లు అవుటయ్యాడు. జంపా ఒక బ్యాట్స్ మన్ ను అత్యధిక సార్లు ఔట్ చేయడం ఇదే. రెండో స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. 

Also Read: సిక్స్ కొట్టిన విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్

ఇకపోతే, వన్డేల్లో 9 వేల పరుగుల మార్కును చేరడానికి రోహిత్ శర్మ నాలుగు పరుగుల దూరంలో నిలిచాడు. అదే సమయంలో ఈ మ్యాచులో అర్థ సెంచరీని మిస్సయ్యాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్సును ఆరంభించిన రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ తో కలిసి 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

Also Read: విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్: స్టీవ్ వా కామెంట్ ఇదీ

తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి విఫలమైన రోహిత్ శర్మ ఈసారి తన రెగ్యులర్ గా బ్యాటింగ్ చేసే మూడో స్థానంలో మైదానంలోకి వచ్చాడు. తొలి వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచులో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. శ్రేయాస్ అయ్యర్ తను రెగ్యులర్ గా బ్యాటింగ్ కు దిగే నాలుగో స్థానంలోనే వచ్చినప్పటికీ విఫలమయ్యాడు.