Dark Secret Of Team India: అసాధారణ స్వింగ్ బౌలింగ్ నైపుణ్యానికి పేరుగాంచిన ప్రవీణ్ కుమార్.. భార‌త జ‌ట్టులో 2000 ద‌శ‌కంలో స్టార్ బౌల‌ర్ గా గుర్తింపు సాధించాడు. అంద‌రూ తాగుబోతులే అంటూ తాజాగా ప్ర‌వీణ్ కుమార్ భారత ప్లేయ‌ర్ల పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశాడు. 

Dark Secret Of Team India-Praveen Kumar: 2000వ దశకం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ వంటి చిన్న నగరాలకు చెందిన క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ భారత క్రికెట్ లో పరివర్తన దశను చూసింది. అసాధారణ స్వింగ్ బౌలింగ్ నైపుణ్యానికి పేరుగాంచిన ప్రవీణ్ కుమార్ ఈ టైమ్ లోనే స్టార్ బౌల‌ర్ గా ఘనత సాధించాడు. కెరీర్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మైదానం వెలుపల వివాదాలతో కుమార్ ప్రయాణం ఆగింది. స్వింగ్ బౌలర్ గా, బ్యాటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌వీణ్ కుమార్ తాజాగా టీమిండియా ప్లేయ‌ర్లు తాగుబోతులే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెటర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. 2007 నుంచి 2012 వరకు భారత్ తరఫున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడిన ప్ర‌వీణ్ కుమార్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు. కెరీర్ మధ్యలోనే భారత జట్టుకు దూరమైన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత జాతీయ జట్టులోకి పునరాగమనం చేయలేకపోయాడు. అయితే, దీనికి కార‌ణం మైదానంలో అతని పేలవమైన ప్రదర్శన కాదనీ, మద్యపానంతో సహా అతని చెడు అలవాట్లు అతని ప్ర‌యాణానికి అడ్డుప‌డ్డాయ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

భార‌త టీ20 జ‌ట్టులోకి రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్..

ఇక తాజాగా ఓ హిందీ వీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారత జట్టులో ప్రతి ఒక్కరూ తాగుతారు.. కానీ చివరికి తానొక్కడినే నిందిస్తార‌ని చెప్పాడు. ''సీనియర్ ఆటగాళ్లతో సహా అందరూ నన్ను తాగవద్దు, అలా చేయవద్దు, ఇది చేయవద్దు అని చెప్పేవారు. కానీ ప్రతి ఒక్కరూ తాగుతారు.. కానీ తాగుబోతు అనే చెడ్డపేరు అంతా నాకే వచ్చిందని'' పేర్కొన్నాడు.

ఆ రోజు తనకు సలహా ఇచ్చింది సచిన్, ద్రవిడ్, గంగూలీ కాదా అని ప్రశ్నించగా.. కెమెరా ముందు ఎవరి పేరునూ ప్రస్తావించదలుచుకోలేదనీ, అందరికీ తెలుసని ప్రవీణ్ కుమార్ సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి భారత జట్టులోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ టెయిల్ ఎండ్‌లో మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ప్రవీణ్ కుమార్ ఆరు టెస్టుల్లో 27 వికెట్లు, 68 వన్డేల్లో 77 వికెట్లు, 10 టీ20ల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. స్వింగ్ బౌలింగ్ లో త‌న‌దైన చెర‌గ‌ని ముద్ర‌ను వేశాడు.

Scroll to load tweet…

ఏడు సార్లు ఛాంపియన్ కానీ పసికూన చేతిలో చిత్తు.. ఢిల్లీ కెప్టెన్సీ నుంచి యశ్ ధుల్ ఔట్