Danni wyatt on Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ స్టైల్, యాటిట్యూడ్ కు లక్షలాది మంది ఫిదా అవుతున్నారు. అయితే, విరాట్ కోహ్లీని లవ్ చేసిన లెస్బియన్ స్టోరీ మీకు తెలుసా?
Danni wyatt on Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టోర్నమెంట్ కు ముందు ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు కోహ్లీ. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఫామ్ ను అందుకున్నాడు. తన సూపర్ సెంచరీతో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ విజయంతో భారత్ సెమీస్ లోకి అడుగుపెట్టింది.
క్రికెట్ లో అద్భుతాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కింగ్ కోహ్లీకి మహిళా క్రికెటర్లలో కూడా మస్తు ఫాలోయింగ్ ఉంది. అయితే, కోహ్లీ 2017 డిసెంబర్ 11న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, పెళ్లికి ముందు విరాట్ కోహ్లీ లవ్ స్టోరీలను గమనిస్తే చాలానే ఉన్నాయి.

నన్ను పెళ్లి చేసుకో విరాట్ కోహ్లీ.. : డ్యానీ వ్యాట్
2014లో ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ (డేనియల్ వ్యాట్) విరాట్ కోహ్లీకి చేసిన మ్యారేజ్ ప్రపోజల్ అప్పట్లో సంచలనం రేపింది. 2014 టీ20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ పరుగుల వరదపారించాడు. దీంతో అక్కడ భారత్ ఫైనల్ చేరుకుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ తనను పెళ్లి చేసుకో విరాట్ అంటూ మ్యారేజ్ ప్రపోజల్ చేసింది.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డ్యానీ వ్యాట్.. "విరాట్ కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో" అంటూ ట్వీట్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్ వైరల్ అయింది. ముఖ్యంగా భారత క్రికెట్ లో సంచలనం రేపింది. సోషల్ మీడియా, ప్రధాన మీడియాతో కవరేజ్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే, దీనిపై మళ్లీ స్పందించలేదు. కానీ, అదే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా డ్యానీ వ్యాట్ విరాట్ కోహ్లీని కలిశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోసారి రచ్చ మొదలైంది.
డ్యానీ వ్యాట్ మ్యారేజ్ ప్రపోజల్ పై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఏంటి?
అయితే, అది జరిగిన దాదాపు 11 ఏండ్ల తర్వాత తాజాగా డ్యానీ వ్యాట్ స్పందించారు. ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న డ్యానీ వ్యాట్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ లో విరాట్ కోహ్లీని కలిసిన తర్వాత అలాంటి ట్వీట్స్ చేయవద్దని హెచ్చరించినట్టు తెలిపారు. అలాగే, ఆ విషయంలో విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పాక తనకు ఒక బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్టు డ్యానీ వివరించారు.
అలాగే, విరాట్ కోహ్లీకి తాను చేసిన మ్యారేజ్ ప్రపోజల్ సీరియస్ కాదనీ, విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తర్వాత ప్రశంసించడానికి అలా చేశానని చెప్పారు. అయితే, ఆ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే వైరల్ అయిందనీ, తన ఫోన్ రీట్వీట్, కామెంట్స్ అలర్ట్ లతో నిండిపోయిందన్నారు. కాగా, డ్యానీ వ్యాట్ ఒక లెస్బియన్. గతేడాది ఫుట్బాల్ ఏజెంట్ జార్జియా హడ్జ్ అనే మహిళతో వివాహం జరిగింది. డ్యానీ వ్యాట్ ఇంగ్లాండ్ జట్టు తరఫున 2 టెస్టులు, 112 వన్డేలు, 167 టీ20లు ఆడారు. అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ తో అదరగొడతారు.
Champions Trophy: భారత్ vs న్యూజిలాండ్.. టీంలో 4 మార్పులు.. వీరులు వచ్చేస్తున్నారు !
