మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులందరికి ఇష్టమైన ఆటగాడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యునిగా తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఐపిఎల్ టోర్నీలో అభిమానులు రాష్ట్రాల వారిగా విడిపోయి తమ జట్టుకు, ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తుంటారు. కానీ ధోని విషయంలో మాత్రం ఈ పార్ములా పనిచేయడం లేదు. అతడు ఆడుతున్నాడంటే ప్రత్యర్థి జట్టు అభిమానులు కూడా ఆ విధ్వంసకర ఆటతీరుకు ఫిదా అవ్వాల్సిందే. ఇలా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని ధనాధన్ ఇన్సింగ్స్ చూసి సీఎస్కే అభిమానులే కాదు ప్రత్యర్థి ఆర్సిబి ఫాలోవర్స్ కూడా మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఆర్సిబి విసిరిన 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే బ్యాట్ మెన్స్ అందరూ తడబడిన వేళ ధోని ఒక్కడే ఒంటిచేత్తో జట్టును గెలిపించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మొత్తం బ్యాటింగ్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్న అతడు పలు వ్యక్తిగత రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. తన ఐపిఎల్ కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును ఈ మ్యాచ్ లో నమోదుచేసుకున్నాడు. కేవలం 48బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచి రికార్డు సృష్టించారు.
తాజాగా సాధించిన పరుగులతో కెప్టెన్ గా ధోని పరుగుల ఖాతా 4000 కు చేరుకుంది. ఇలా ఓ జట్టు కెప్టెన్ గా నాలుగు వేల పరుగుల మైలురాయిని దాటిని ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో ధోని ఆరో స్థానంలో నిలిచారు. తనకంటే ఎక్కువ పరుగులతో టాప్ లో నిలిచిన ఆటగాళ్ల కంటే ధోని స్ట్రైక్ రేట్(42.03) అధికంగా వుండటం విశేషం.
ఈ మ్యాచ్ లో ధోని ఏడు సిక్సర్లు బాదడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన ఫీట్ నమోదైంది. నిన్నటి ఇన్సింగ్స్ తో ఐపీఎల్ లో 200సిక్సర్లు కొట్టిన ఏకైకక భారత ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇప్పటి వరకు జరిగిన 12సీజన్లలో ధోనీ 203 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్ గా అతడు మూడో స్థానంలో ఉన్నాడు.
అయితే ధోని ఇంత వీరోచితంగా పోరాడినా సీఎస్కే ఒక్క పరుగు తేడాతో ఆర్సిబి చేతిలో ఓటమిపాలయ్యింది. 28 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు దిగిన ధోని సీఎస్కేను గెలిపించినంత పని చేశాడు. అయితే చివరి బాల్ కు కాస్త తడబడటంతో సింగిల్ సాధించలేక సీఎస్కే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినా ఈ మ్యాచ్ ద్వారా ధోనిలోని అసలుసిసలైన ఆటగాన్ని చూసి అభిమానులు క్రికెట్ మజాను పొందారు.
And a lovely match for a yellovely record! #WhistlePodu #Yellove #RCBvCSK 🦁💛 pic.twitter.com/zJ2DExNBP2
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2019
సంబంధిత వార్తలు
ధోని విధ్వంసం...కోహ్లీ అదృష్టం: ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 22, 2019, 4:59 PM IST