సారాంశం

ICC Cricket World Cup 2023: బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన త‌ర్వాత‌ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క, కుమార్తె వామికతో కలిసి ముంబ‌యికి తిరిగి వెళ్లారు. అయితే, విరాట్ కోహ్లీ ముంబ‌యి ఎయిర్‌పోర్ట్ లో ఉన్న దృశ్యాల‌కు సంబంధించిన‌ వీడియోలు వైరల్ గా మారాయి.
 

India vs New Zealand: అభిమానులు, మీడియాతో ఎంతో కూల్ గా ఉంటే కింగ్ విరాట్ కోహ్లీకి ఈ సారి మాత్రం కోసం వ‌చ్చింది. ఆదివారం జరిగిన ప్రపంచ కప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీతో పాటు ఒక వికెట్‌ కూడా తీశాడు. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ కూడా వ‌చ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి ముంబ‌యికి వెళ్లాడు. అయితే ముంబ‌యి ఎయిర్‌పోర్ట్‌లో విరాట్ ఫోటోల కోసం ఎగ‌బ‌డిన ఆయ‌న అభిమానులు, మీడియా, ప్రేక్షకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగిందంటే..?

నెదర్లాండ్స్‌తో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క, కుమార్తె వామికతో ముంబ‌యికి తిరిగి చేరుకున్నారు. 15న ముంబ‌యిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం విరాట్ జట్టుతో కలసి రాకుండా భార్య, కుమార్తెతో కలిసి బెంగళూరు నుంచి ముంబ‌యికి చేరుకున్నారు. ముంబ‌యి ఎయిర్‌పోర్టు నుంచి విరాట్ కారు వద్దకు వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, విరాట్ బయటకు వెళ్తుండగా, ఫోటోగ్రాఫర్‌లు, అభిమానులు అతనిని ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. విరాట్ విమానాశ్రయం గేట్ నుండి కారు వరకు ఫోటోలు తీసుకోవ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే కారు దగ్గరున్న అభిమానులకు ఫొటోలు ఇచ్చేందుకు నిరాకరించారు.

ఎందుకంటే, కారులో భార్య, త‌న కూతురు ఉన్నందున కారు దగ్గర ఫోటోలు ఇవ్వనని విరాట్ స్పష్టం చేశారు. ఫోటోలు తీసుకోవ‌డానికి పట్టుబట్టిన వారితో విరాట్ కాస్త చిరాకుతో మాట్లాడుతూ.. "కారు దగ్గర కాదు ఇక్కడే (ఫోటోలు) తీయండి. తెల్లవారుజామున నిద్రలేచింది, దయచేసి డ్రెస్ చేసుకోనివ్వండి" అని విరాట్ చెప్పాడు. ఆ తర్వాత కూడా జరుగుతున్న హంగామా, ఫోటో షూట్ చూసి విరాట్ ఫోటో గ్రాఫ‌ర్లు, అభిమానులతో ‘హే బేటీ కో ఘర్ లేకే జానా హై’ అంటూ వెళ్లిపోయారు.