క్రికెట్ లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో బర్త్‌ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన, కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న యోధులకు గౌరవ సూచకంగా పుట్టినరోజు జరుపుకోవాలని భావించారు.

Aslo Read:ఎందరికో స్ఫూర్తి, కాలాన్ని ఆపగలడు: సచిన్‌కు క్రికెటర్ల పుట్టినరోజు శుభాకాంక్షలు

దీనిలో భాగంగా తన మాతృమూర్తి రజనీ టెండూల్కర్ ఆశీర్వాదం తీసుకున్నారు సచిన్. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడికి గణేశుడి ప్రతిమను బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మాస్టర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

‘‘ తన తల్లి ఆశీర్వాదం తీసుకుని ఈ రోజును ప్రారంభించానని.. ఆమె తనకు గణపతి బప్పా ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. ఇది అమూల్యమైనది అంటూ సచిన్ పేర్కొన్నారు.

అంతకుముందు విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రికెట్ ఆటపై అభిరుచి ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పాజీ ఈ ఏడాది మీకు అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నా అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్‌తో కలిసి ఉన్న ఫోటోను విరాట్ షేర్ చేశాడు.

Also Read:అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహణకు కసరత్తు: ఆ షెడ్యూల్ మారిస్తే ఊరుకోబోమంటున్న పాక్

మరో దిగ్గజ క్రికెటర్, భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా క్రికెట్ దేవుడికి విషెస్ తెలియజేశాడు. ‘ఇది ఒక నిజం, ఒక గొప్ప వ్యక్తి బ్యాటింగ్ చేస్తూ భారత్‌లో సమయాన్ని ఆపగలిగేవాడు. అయితే, సచిన్ కెరీర్‌లో అతిపెద్ద స్ఫూర్తి ఏదైనా ఉందంటే అది ఈ రెండు చిత్రాల్లోనే దాగి ఉంది. ప్రతీ కష్టం వెనుక ఓ విజయం ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో దీనిని తప్పకుండా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ అన్నాడు.