Cheteshwar pujara: భారత టెస్టు జట్టుకు దూరమైన ఛటేశ్వర్ పుజారా సంచలనం సృష్టించాడు. 2024 సీజన్ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే జార్ఖండ్ లాంటి బలమైన జట్టుపై డబుల్ సెంచరీ కొట్టాడు. దీంతో టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసెజ్ పంపాడు.
Cheteshwar pujara Double Hundred: భారత ప్లేయర్ ఛటేశ్వర్ పుజారా మరో సంచలన ఇన్నింగ్స్ తో టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసెజ్ పంపాడు. రంజీ ట్రోఫీ 2024 తొలి మ్యాచ్‌లోనే టీమిండియా స్టార్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికా పర్యటన టీమిండియా జట్టు నుంచి తనను తప్పించిన వారికి బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. రంజీలో మ్యాచ్ లో డబుల్ సెంచరీ కొట్టాడు.
సౌరాష్ట్ర, జార్ఖండ్‌లతో జరిగిన తొలి మ్యాచ్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా తన బ్యాట్ రాణించి డబుల్ సెంచరీ సాధించాడు. మ్యాచ్ మూడో రోజు లంచ్ వరకు క్రీజులో ఉన్న పుజారా 243 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 30 ఫోర్లు కొట్టాడు. 356 బంతుల్లో 68.26 స్ట్రైక్ రేట్‌తో 243 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
MS DHONI: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైరల్.. కెప్టెన్ కూల్ పై విమర్శలు
ఛటేశ్వర్ పుజారా 17వ డబుల్ సెంచరీ..
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛటేశ్వర్ పుజారాకు ఇది 17వ డబుల్ సెంచరీ. తాజా డబుల్ సెంచరీతో పుజారా పేరు సోషల్ మీడియాతో మార్మోగుతోంది. పుజారాను రెడ్ క్లాస్ క్రికెట్ రన్ మెషీన్ అని క్రికెట్ అభిమానులు అభివర్ణించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ నుండి పుజారాను టీమ్ ఇండియాలో లేడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత సెలక్టర్లు టీమిండియా జట్టును ప్రకటించాల్సిన తరుణంలో పుజారా భారీ ఇన్నింగ్స్ తో రాణించడం విశేషం.
నేడో రేపో బీసీసీఐ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు రంజీల్లో ఛతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ చేయడం సెలక్టర్లను ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. మరీ పుజారాకు జట్టులో చోటు కల్పిస్తారో లేదో చూడాలి మరి.. !
SHWETA SEHRAWAT: టీమిండియా క్రికెటర్ సంచలన ఇన్నింగ్స్.. 150 బంతుల్లో 242 పరుగులు
