భారత్-చైనా సరిహద్దుల్లో గాల్వాన్ లోయ వద్ద అమరులైన భారత జవాన్లకు దేశ ప్రజలు నివాలర్పిస్తున్నారు. చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే సైనికుల మరణాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ వైద్యుడు.

Also Read:గాల్వాన్ లోయలో చైనా సైనికుల్ని మట్టికరిపించి.. అమరులైన జవాన్లు వీరే

వివరాల్లోకి వెళితే... మధు సీఎస్‌కే తరపున డాక్టర్‌గా సేవలందించాడు. సైనికుల కుటుంబాల్లో భరోసా నింపాల్సిందిపోయి అమర జవాన్ల మరణాలను కించపరుస్తూ ట్వీట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. వెంటనే అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

మధు ట్వీట్ గురించి సీఎస్‌కేకు తెలియదని... మా దృష్టికి వెంటనే అతనిని వైద్యుడి స్థానం నుంచి తొలగిస్తున్నామని, చెత్త ట్వీట్‌పై సూపర్‌కింగ్స్‌ చింతిస్తుందని ట్వీట్‌లో పేర్కొంది.

Also Read:దేశ సార్వభౌమాధికారంపై రాజీ లేదు,సైలెంట్‌గా ఉండబోం: చైనాకు మోడీ వార్నింగ్

కాగా తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనాతో గత ఆరువారాలుగా నెలకొన్న వివాదం ప్రతిష్టంభన సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన సైనికులు భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.