Asianet News TeluguAsianet News Telugu

గాల్వాన్ లోయలో చైనా సైనికుల్ని మట్టికరిపించి.. అమరులైన జవాన్లు వీరే

భారత్- చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల పేర్లు, వివరాలను భారత సైన్యం బుధవారం విడుదల చేసింది

indian Army releases names of soldiers killed in India-China border clash
Author
New Delhi, First Published Jun 17, 2020, 4:09 PM IST

భారత్- చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల పేర్లు, వివరాలను భారత సైన్యం బుధవారం విడుదల చేసింది. మరణించిన వారిలో ఒకరు కల్నల్ కాగా, మిగిలిన వారు నాయిబ్ సుబేదార్, హవిల్దార్, సిపాయి హోదా కలిగిన వారు


1. బి.సంతోష్‌బాబు (కర్నల్‌) - సూర్యాపేట, తెలంగాణ  

2. నాదూరాం సోరెన్‌ (నాయిబ్ సుబేదార్‌) - మయూర్‌బంజ్‌, ఒడిశా  

3. మన్‌దీప్‌ సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌) - పటియాలా, పంజాబ్‌  

4. సత్నం సింగ్‌ (నాయిబ్ సుబేదార్‌)- గురుదాస్‌పూర్‌, పంజాబ్‌  

5. కె. పళని (హవిల్దార్‌) - మదురై, తమిళనాడు  

6. సునీల్‌ కుమార్‌ (హవిల్దార్‌) - పట్నా, బిహార్‌  

7. బిపుల్‌ రాయ్‌ (హవిల్దార్‌) - మీరట్‌ నగరం, ఉత్తర్‌ప్రదేశ్‌  

సిపాయిలు..   

8. దీపక్‌ కుమార్‌ - రీవా  

9. రాజేష్‌ అరంగ్‌ - బిర్గుం  

10. కుందన్‌ కుమార్‌ ఓఝా  - సాహిబ్‌ గంజ్‌  

11. గనేష్‌ రాం - కాంకేర్‌  

12. చంద్రకాంత ప్రధాన్‌ - కందమాల్‌  

13. అంకుశ్‌ - హమిర్‌పూర్‌  

14. గుర్విందర్‌  - సంగ్రూర్‌  

15. గుర్‌తేజ్‌ సింగ్‌  - మాన్సా  

16. చందన్‌ కుమార్‌  - భోజ్‌పూర్‌  

17. కుందన్‌ కుమార్‌  - సహస్ర  

18. అమన్‌ కుమార్‌ - సమస్థిపూర్‌  

19. జైకిశోర్‌ సింగ్‌ - వైశాలి  

20. గనేశ్‌ హన్స్‌దా -తూర్పు సింగ్‌భూం  


మరోవైపు ఈ ఘటనలో మరణించిన సైనికుల గురించి చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘర్షణలో 35 మంది చైనా సైనికులు చనిపోయినట్లు అమెరికా నిఘా వర్గాల సమాచారం.

భారత సైనికులే అక్రమంగా తమ భూభాగంలోకి చొరబడి, దాడికి పాల్పడ్డారని చైనా ఆరోపణలు గుప్పిస్తోంది. సరిహద్దులలో పరిస్ధితి గంభీరంగా ఉందని, భారత్ తక్షణం తన దళాలను అదుపులో ఉంచి, ఏకపక్షంగా వ్యవహరించవద్దని చైనా విదేశాంగ శాఖ కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios