Joginder Sharma: ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమిండియా హీరోపై కేసు న‌మోదైంది. ఎఫ్ఐఆర్ న‌మోదుచేసిన పోలీసులు..  ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంపై విచారణ ప్రారంభించారు.

Case filed against T20 World Cup hero: టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోపై కేసు న‌మోదైంది. హ‌ర్యానాలోని హిసార్ కు చెందిన ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మపై కేసు న‌మోదుచేశాడు. జోగిందర్ సహా ఆరుగురిపై కేసు నమోదైంది. ఒక వ్య‌క్తి ఈ నెల 1న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ వివాదంలో జోగిందర్ ప్రమేయం ఉందనీ, అత‌నిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జోగిందర్ ప్రస్తుతం హర్యానాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను జోగిందర్ ఖండించారు. 'ఈ కేసు గురించి నాకేమీ తెలియదు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేనెప్పుడూ ఆయన్ని కలవలేదని' తెలిపాడు.

ఆస్తి తగాదాలతో ఆత్మహత్య.. ! 

జనవరి 1న పవన్ ఆత్మహత్య చేసుకున్నట్లు హర్యానా పోలీసులు తెలిపారు. మరుసటి రోజు కోర్టులో ఆస్తి వివాదం కేసు నడుస్తోందని అతని తల్లి సునీత ఫిర్యాదు చేసింది. జోగిందర్ సహా ఆరుగురు తమ‌ను వేధిస్తున్నారని పవన్ తల్లి ఆరోపించారు. జోగిందర్ ఒత్తిడి వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రస్తుత చట్టం ప్రకారం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలనీ, పవన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని వారు ఆరు డిమాండ్లు చేశారు.

వైట్ వాష్.. ! మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియా చేతితో పాకిస్తాన్ చిత్తు

పోలీసులు దర్యాప్తు షురూ.. 

జోగిందర్ తో పాటు మరో ఐదుగురు అజయ్ వీర్, ఈశ్వర్, ప్రేమ్, రాజేంద్ర, సిహాగ్ లపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేసినట్లు హర్యానా సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అఘాయిత్యాల నిబంధనను విచారణ తర్వాతే చేర్చే అవ‌కాశ‌ముంది. ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది.

DAVID WARNER: గ్రౌండ్ లోనే ఏడ్చిన డేవిడ్ వార్న‌ర్.. వీడియో వైర‌ల్ !