వైట్ వాష్.. ! మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియా చేతితో పాకిస్తాన్ చిత్తు
australia vs pakistan: సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు పాకిస్థాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.
AUS vs PAK: ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ వైట్ వాష్ అయింది. ఆస్ట్రేలియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్ లలో కూడా పాక్ ను ఆసీస్ జట్టు చిత్తు చేసింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 3-0తో గెలుచుకుంది. సిడ్నీ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కంగారూ జట్టు మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-0తో కైవసం చేసుకోవడంతో పాక్ ను వైట్ వాష్ చేసింది.
అంతకుముందు, పెర్త్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మెల్బోర్న్ తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన మూడో, చివరి టెస్టులో కంగారూ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో ఆసీస్ టెస్టు సిరీస్ ను దక్కించుకుంది. మూడో టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో313, రెండో ఇన్నింగ్స్ లో 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 130/2తో విజయం సాధించింది. తన కెరీర్ లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ సెకండ్ ఇన్నింగ్స్ లో 57 పరుగులు చేసి ఆసీస్ కు విజయాన్ని అందించాడు.
పాక్ ఓటమితో మరో దారుణ రికార్డును మూటకట్టుకుంది. ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ వరుసగా 17 టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 1999 నుంచి ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ జట్టు వరుసగా 17 టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఏ దేశంలోనైనా వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిన విజిటింగ్ టీమ్‌గా పాకిస్తాన్ అవమానకరమైన రికార్డును నమోదుచేసింది.
వారం రోజుల్లో బరువు తగ్గొచ్చా..? ఎలా సాధ్యం..?