ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో టీమిండియా అనూహ్య పరాజయం పాలైంది. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల గ్రూప్ మాత్రం సిరీస్ ఫలితాన్ని మార్చింది.  

ఎడ్జబాస్టన్ వేదికగా ముగిసిన భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు సిరీస్ ను 2-2 తో సమం చేసింది. అయితే ఇంగ్లాండ్ జట్టు అభిమానుల గ్రూప్ గా ఉన్న బర్మీ ఆర్మీ మాత్రం సిరీస్ ఫలితాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది. సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు 1-0తో గెలిచినట్టుగా తమ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టింది. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా ఇదే విషయమై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పందించాడు. ‘బ్రిటీషర్లకు చరిత్రను వక్రీకరించడం వెన్నతో పెట్టిన విద్య. వారి స్వలాభం కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారు..’అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతున్నది. 

ఇక బర్మీ ఆర్మీ చేసిన ఈ ట్వీట్ కు టీమిండియా ఫ్యాన్స్ కూడా చురకలంటిస్తున్నారు. ‘ఓ అలాగా.. అలాగైతే గతేడాది మేము 2-1తో సిరీస్ నెగ్గాం..’, ‘గతేడాది వర్షం వల్ల మీరు బతికిపోయారు. అది కూడా గుర్తు పెట్టుకో..’ అని ట్వీట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. 2007 తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ గెలిచే అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. 2007 లో ఇంగ్లాండ్ గడ్డ మీద సిరీస్ గెలిచిన అనంతరం భారత జట్టు.. 2011, 2014, 2018లలో ఇంగ్లాండ్ కు వెళ్లింది. కానీ సిరీస్ ఫలితాలు భారత్ ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. మూడు సిరీస్ లో ఇండియా ఉత్తచేతులతోనే తిరిగిరావాల్సి వచ్చింది. 

2011 లో 4 మ్యాచుల సిరీస్ లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. 2014లో ఇంగ్లాండ్ 3-1తో సిరీస్ గెలిచింది. 2018 లో విరాట్ కోహ్లి సేన 1-4తో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక 2021 లో ఆధిక్యం 2-1తో ఉన్న భారత జట్టు రీషెడ్యూల్డ్ టెస్టులో మాత్రం ఓడి సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. 

Scroll to load tweet…