Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

India vs England: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 
 

Breaking Virat Kohli's record. Rohit Sharma becomes the highest run-getter in the World Test Championship RMA
Author
First Published Feb 4, 2024, 7:57 PM IST | Last Updated Feb 4, 2024, 7:57 PM IST

Rohit Sharma Records: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ మరో రికార్డు తన ఖాతాలో వేసకున్నాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 41 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేసాడు. రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 21 బంతుల్లో 13 పరుగులు చేశాడు.  రోహిత్ శర్మ నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఆశించారు కానీ పెద్దగా పరుగులు చేయకుండా నిరాశ పరిచాడు.

విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

భారత స్టార్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పుడు విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో 36 మ్యాచ్‌ల్లో 60 ఇన్నింగ్స్‌ల్లో 39.21 సగటుతో విరాట్ కోహ్లీ 2235 పరుగులు చేశాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ స్కోరు 254* పరుగులుగా ఉన్నాయి.

టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా స‌రికొత్త రికార్డు

రోహిత్ శర్మ ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మెన్ గా నిడిచాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో 29 మ్యాచ్‌లలో 49 ఇన్నింగ్స్‌లలో 49.82 సగటుతో 2242 పరుగులు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ కాలంలో రోహిత్ శర్మ 7 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరు 212 పరుగులు. మొత్తంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కొనసాగుతున్నాడు. జో రూట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో 49 మ్యాచ్‌లలో 89 ఇన్నింగ్స్‌లలో 49.06 సగటుతో అత్యధికంగా 4023 పరుగులు చేశాడు. ఈ కాలంలో జో రూట్ 12 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో జో రూట్ అత్యుత్తమ స్కోరు 228 పరుగులు.

డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:  

  1. రోహిత్ శర్మ- 2242 పరుగులు (49 ఇన్నింగ్స్)
  2. విరాట్ కోహ్లీ- 2235 పరుగులు (60 ఇన్నింగ్స్)
  3. చటేశ్వర్ పుజారా- 1769 పరుగులు (62 ఇన్నింగ్స్‌లు)
  4. అజింక్య రహానే – 1589 పరుగులు (49 ఇన్నింగ్స్)

100 ఏండ్లలో ఒకే ఒక్క‌డు.. టెస్టు క్రికెట్ లో బుమ్రా స‌రికొత్త రికార్డు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios