IPL 2024: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి మహ్మద్ షమీ ఔట్ !

Mohammed Shami: వ‌చ్చే నెలాఖ‌రు నుంచి ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభం కానుంది. అయితే, టీమిండియా స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఐపీఎల్ 2024 సీజ‌న్ దుర‌మ‌య్యాడు. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. 
 

Big shock for Gujarat Titans Mohammed Shami ruled out of IPL 2024,  reports RMA

Mohammed Shami ruled out of IPL 2024: టీమిండియా స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా పేసర్ మహ్మద్ షమీ వచ్చే నెలలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు దూరమయ్యాడనీ, అతను యూకేలో శస్త్రచికిత్స చేయించుకోవ‌డానికి వెళ్ల‌నున్నాడ‌ని పీటీఐ నివేదిక‌లు పేర్కొన్నాయి. గాయం కార‌ణంగా ప్ర‌స్తుతం భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్ కు కూడా ష‌మీ దూరంగా ఉన్నాడు.

ప్రస్తుతం భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్న 33 ఏళ్ల టీమిండియా స్టార్ బౌలర్ ష‌మీ చివరిసారిగా గ‌తేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ త‌ర‌ఫున మ్యాచ్ ఆడాడు. గాయం కారణంగా అప్ప‌టి నుంచి అత‌ను బీసీసీఐ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణలో కోలుకుంటున్నాడు. అయితే, షమీ ప్రత్యేక చీలమండ చికిత్స కోసం జనవరి చివరి వారంలో లండన్ వెళ్లాడనీ, మూడు వారాల తర్వాత లైట్ రన్నింగ్ స్టార్ట్ చేసి త‌ర్వాత మ‌ళ్లీ చికిత్స తీసుకోవ‌చ్చ‌ని వైద్యులు తెలిపార‌ని స‌మాచారం. అయితే, చికిత్స‌కు ఉప‌యోగించిన ఇంజెక్షన్ పని చేయలేదనీ, ఇప్పుడు మిగిలింది శస్త్రచికిత్స మాత్రమేనని వైద్యులు తెలిపిన‌ట్టు సంబంధిత రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాశ్మీర్ వీధుల్లో బ్యాట్ తో అదరగొట్టిన సచిన్ టెండూల్కర్.. ! వీడియో

ష‌మీ శస్త్రచికిత్స కోసం త్వరలోనే యూకే వెళ్లనున్నారనీ, ఐపీఎల్ ఆడ‌ట‌మూ క‌ష్ట‌మేనని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపిన‌ట్టు పీటీఐ నివేదించింది. గ‌తేడాది జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ష‌మీ అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేశౄడు. 24 వికెట్లు తీసుకుని మెగా టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచాడు. ఇటీవల అర్జున అవార్డు అందుకున్న షమీ తన దశాబ్ద కెరీర్ లో 229 టెస్టులు, 195 వన్డేలు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు.

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన టాప్-10 క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా ?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios