ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన టాప్-10 క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా ?

Who has hit 6 sixes in an over: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్ లో రైల్వేస్ స్పిన్నర్ దమన్ దీప్ సింగ్ బౌలింగ్ ఆంధ్ర ప్లేయ‌ర్ ఎం వంశీకృష్ణ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు. దీంతో వ‌రుస‌గా 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొట్టిన 4వ భార‌త బ్యాట‌ర్ గా నిలిచాడు.

Top 10 cricketers who hit 6 sixes in 6 balls in an over RMA

Who has hit 6 sixes in an over: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యంగ్ క్రికెట‌ర్  ఎం వంశీకృష్ణ రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో కేవ‌లం 64 బంతుల్లోనే 110 ప‌రుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ఫిబ్రవరి 21న రైల్వేస్‌తో జరిగిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. దీంతో వ‌రుస‌గా 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొట్టిన 4వ భార‌త బ్యాట‌ర్ గా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో మొత్తంగా 9వ ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు.

 

ఇప్ప‌టివ‌ర‌కు ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన క్రికెట‌ర్లు జాబితాను గ‌మనిస్తే.. 

Who has hit 6 sixes in an over?

1. గ్యారీ సోబర్స్

వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండ‌ర్ ల‌లో ఒక‌డు. ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్ కూడా అతనే. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతున్నప్పుడు, అతను గ్లామోర్గాన్ బౌలర్ మాల్కమ్ నాష్ బౌలింగ్ పై విరుచుకుప‌డుతూ ఒకే ఓవ‌ర్లో ఆరు సిక్స‌ర్లు బాదాడు. 31 ఆగస్టు1968న ఈ చారిత్రక ఘనతను సాధించాడు.

2. రవిశాస్త్రి

భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్. ఆటగాడిగా, బ్రాడ్‌కాస్టర్‌గా, భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఒకరు. బాంబే (ప్రస్తుతం ముంబై), బరోడా మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ర‌విశాస్త్రి ఆరు సిక్సర్లు కొట్టాడు. స్పిన్నర్ తిలక్ రాజ్ బౌలింగ్ లో  6 సిక్సర్లు బాదాడు. 19 జనవరి 1985న ఈ ఘనత సాధించాడు.

3. హెర్షెల్ గిబ్స్
అటాకింగ్ సౌతాఫ్రికా బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవ‌ర్ లో 6 సిక్స‌ర్లు బాదిన‌ ఘనత సాధించిన తొలి ఆటగాడు. 16 మార్చి 2007న కరీబియన్‌లో జరిగిన 2007 వ‌న్డే ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే ఆటాడుకున్నాడు. అత‌ను వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.  వ‌న్డే క్రికెట్ లో  ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్ గిబ్స్. 

4. యువరాజ్ సింగ్

2007 టీ20 ప్రపంచ కప్‌లో భార‌త స్టార్ ఆల్ రౌండర్ యువ‌రాజ్ సింగ్ కూడా ఒక ఓవ‌ర్ లో 6 సిక్స‌ర్లు కొట్టాడు. ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లోయువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్సర్లు ఈ టోర్నమెంట్‌లో హైలైట్ గా నిలిచాయి. 19 సెప్టెంబరు 2007న స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ తో యువీ ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచ‌రీ కొట్టాడు.

 

 5. రాస్ వైట్లీ 

23 జూలై 2017న టీ20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్‌తో జరిగిన వోర్సెస్టర్‌షైర్ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ కార్ల్ కార్వర్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ వోర్సెస్టర్‌షైర్‌కు చెందిన రాస్ వైట్లీ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.

 6. హజ్రతుల్లా జజాయ్

14 అక్టోబరు 2018న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ అబ్దుల్లా మజారీ వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్స‌ర్లు బాదాడు.

7. కీరన్ పొలార్డ్

బిగ్ ప‌వర్ హిట్టర్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కూడా ఒక ఓవ‌ర్ లో ఆరు సిక్స‌ర్లు బాదాడు. 3 మార్చి  2021న టీ20 సిరీస్‌లో శ్రీలంక స్పిన్నర్ అకిలా దనంజయ బౌలింగ్ ను చిత్తు చేశాడు.

8. జస్కరన్ మల్హోత్రా 

యునైటెడ్ స్టేట్స్ బ్యాటర్ జస్కరన్ మల్హోత్రా 9 సెప్టెంబర్ 2021న పాపువా న్యూ గినియా బౌలర్ గౌడి టోకాపై ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు.

9. రుతురాజ్ గైక్వాడ్

ఉత్తరప్రదేశ్‌తో మహారాష్ట్ర విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో 220 పరుగుల వద్ద ఎడమచేతి వాటం స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ ను ఉతికిపారేస్తూ సిక్స‌ర్ల మోత మోగించాడు.

మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్‌ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios