Asianet News TeluguAsianet News Telugu

India Vs New Zealand: ఇండియాతో టీ20 సిరీస్ కు ముందు కివీస్ కు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ మామ

Kane Williamson: రేపటి నుంచి టీమిండియాతో మొదలుకానున్న టీ20 సిరీస్ కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్  తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా ఇండియా టూర్ నుంచి తప్పుకున్న కాన్వే స్థానంలో కేన్ మామ కూడా చేరాడు.

Big blow to new Zealand ahead of T20I against Team India, Kane Williamson to miss the series
Author
Hyderabad, First Published Nov 16, 2021, 11:31 AM IST

రెండ్రోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్ లో Australia చేతిలో ఓటమిపాలైన New Zealand.. రేపటి నుంచి Team Indiaతో టీ 20  సిరీస్ ఆడనున్నది. ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న న్యూజిలాండ్ కు సిరీస్ కు  ఒక్కరోజు ముందే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఈ సిరీస్ నుంచి తప్పుకోనున్నాడు. కొద్దిరోజులుగా అతడు మోచేయి గాయంతో బాధపడుతున్నాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా  ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే టీ20 సిరీస్ నుంచి తప్పుకోనున్న కేన్ మామ.. టెస్టు సిరీస్ కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.

టీమిండియాతో  న్యూజిలాండ్.. మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే. జైపూర్ లో నవంబర్ 17న తొలి టీ20 జరుగనుండగా.. 19 (రాంచీ), 21 (కోల్కతా) న మూడో టీ20 జరుగనుంది. నవంబర్ 25-29 దాకా తొలి టెస్టు కాన్పూర్ లో.. డిసెంబర్ 3-7 దాకా ముంబై లోని వాంఖడే స్టేడియంలో రెండో  టెస్టు జరగాల్సి ఉంది. 

భారత్ లాగే తీరిక లేని క్రికెట్ ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు కూడా ఆ జట్టు ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పిస్తున్నది. టీమిండియాతో టీ20 సిరీస్ కు Kane williamson స్థానంలో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (Tim Southee)  బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే టెస్టు సిరీస్ కు మాత్రం కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి చేరుతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ పైనే కేన్ దృష్టి సారించాడు. ఈ ఏడాది జరిగిన తొలి  టెస్టు ఛాంపియన్షిప్ లో కివీస్.. భారత్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

 

కొద్దిరోజులుగా మోచేయి గాయంతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్.. టీ20 ప్రపంచకప్ లో ఆడుతాడా..? లేదా..? అనే సందేహాలు వెల్లువెత్తాయి. కానీ  అన్ని పార్మాట్లలో కివీస్ ను సమర్థవంతంగా నడిపిస్తున్న అతడు.. టీ20 ప్రపంచకప్ లో గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆడాడు. ఇక  ఆసీస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అయితే అతడి ప్రదర్శన చూసి తీరాల్సిందే. 

కాగా.. టీమిండియాతో సిరీస్ కు ముందు న్యూజిలాండ్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చేతి గాయంతో ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ డావెన్ కాన్వే.. టీ20 సిరీస్ తో పాటు టెస్టు సిరీస్ కూ దూరమయ్యాడు. ఆ స్థానంలో ఆల్ రౌండర్ డరిల్ మిచెల్ టెస్టు సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇక ఇప్పుడు  టీ20 సిరీస్ కు కేన్ మామ కూడా దూరమవ్వడం గమనార్హం. 

భారత్ తో టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు : మార్టిన్ గప్తిల్, కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నె, డరిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్,  లాకీ ఫెర్గూసన్

Follow Us:
Download App:
  • android
  • ios