ఐపీఎల్ రిటెన్షన్ ను ప్రారంభించిన బీసీసీఐ.. ఫ్రాంఛైజీల మధ్య విభేదాలు.. ఏం జరుగుతోంది?
IPL 2025 Mega Auction: ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్ లో ఫ్రాంఛైజీల విభేధాలకు సంబంధించి ప్రస్తుతానికి బీసీసీఐ వద్ద ఎలాంటి పరిష్కారం లేదు. అయితే, పాత విధానంలోనే అపెక్స్ బాడీ రిటెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం ఒక్కటే సానుకూలాంశంగా కనిపిస్తోందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్ ప్రక్రియను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రారంభించింది. అయితే ఫ్రాంచైజీ జట్లు రిటెన్షన్ విధానంపై ఒకే నిర్ణయానికి రావడంలో విఫలమయ్యాయి. ఈ విషయంలో ఆయా ఫ్రాంఛైజీల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనుంది. భారీ వేలానికి ముందు రిటెన్షన్ విధానాన్ని ఖరారు చేసే ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. అయితే సమస్య ఏమిటంటే ఫ్రాంచైజీలు ఈ విషయంలో పరస్పరం విభేదిస్తూనే ఉన్నారు. రాబోయే సమావేశంలో బీసీసీఐ ఆయా ఫ్రాంఛైజీలతో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అందుతున్న తాజా రిపోర్టులు ప్రకారం.. ప్రతి ఫ్రాంఛైజీకి రిటెన్షన్ నియమానికి సంబంధించి పలు డిమాండ్లు చేస్తున్నాయి. కొందరు ఒకే చెబితే మరికొందరు వ్యకతిరేకిస్తున్నారు. దీంతో రిటెన్షన్ పై ఏకాభిప్రాయం కుదరడం లేదు. అయితే, మెజారిటీ జట్లు 5-7 మంది ఆటగాళ్లను ఉంచుకోవాలని కోరుతున్నాయి. ఇందులో ఒక ఫ్రాంఛైజీ 8 మంది ఆటగాళ్లను రిటెన్షన్‌కు అభ్యర్థించింది. అలాగే, ఒక్క ఆటగాడిని కూడా రిటెన్షన్ చేసుకోవడానికి ఇష్టపడని ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి.
మూడు సంవత్సరాల క్రితం ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా 4 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో గరిష్టంగా ముగ్గురు భారతీయ ఆటగాళ్లు లేదా ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. ఇప్పుడు రిటెన్షన్ విషయంలో ఫ్రాంచైజీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఫ్రాంఛైజీలు ఇంకా సమావేశమై చర్చించి ఒక ఉమ్మడి అంగీకారానికి రాకపోవడంతో ఈ సమస్య ఇంకా పరిష్కారం లభించలేదు.
ఐపీఎల్ 2025 మెగా వేలంతో ప్రతిజట్టు తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి. కొంతమంది ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే సమయంలో మరికొందరిని వదిలించుకోవడంపై దృష్టిపెట్టాయి. అయితే, మెజారిటీ ఫ్రాంచైజీల అభిప్రాయం ప్రకారం బీసీసీఐ 5-7 మంది ఆటగాళ్లను రిటెన్షన్‌కు అనుమతించవచ్చు. ఇదే సమయంలోరాబోయే వేలం కోసం రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను మళ్లీ ప్రవేశపెట్టాలని కొన్ని జట్లు బీసీసీఐని కోరాయి. వీటిపై స్పష్టత మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశముంది.