Asianet News TeluguAsianet News Telugu

టెస్టులకు ఓ జట్టు.. టీ20లకు మరో జట్టు.. మళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్న సెలెక్టర్లు..

India Team For SA T20I Series: ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు  కీలక సిరీస్ లు ఆడనున్నది.  వచ్చే నెలలో దక్షిణాఫ్రికా తో ఐదు టీ20 లు ఆడనున్న భారత్..   ఆ తర్వాత  ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 

BCCI Selectors to Pick two Squads For SA T20 Series and England Tour
Author
India, First Published May 16, 2022, 10:00 PM IST

గతేడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్టులు ఆడింది. సరిగ్గా ఇదే సమయంలో శ్రీలంక లో కూడా మరో భారత జట్టు వన్డేలు, టీ20లు ఆడింది.  ఇప్పుడు అదే ఫార్ములాను టీమిండియా మళ్లీ పాటించబోతున్నది. మరోసారి రెండు జట్ల ఫార్ములాను  వాడేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారు. అయితే ఈసారి చిన్న ఛేంజ్. గతంలో ఇంగ్లాండ్, శ్రీలంక పర్యటనలు సమాంతరంగా  జరగగా.. ఇప్పుడు  దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్  సిరీస్ ల మధ్య సుమారు 15 రోజుల  గ్యాప్ ఉంది.  

దక్షిణాఫ్రికా తో జూన్ 9 నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు.. భారత ఆల్ ఫార్మాట్ ప్లేయర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా లకు రెస్ట్ ఇవ్వనున్నారు. రెండు నెలలుగా ఐపీఎల్ లో తీరికలేకుండా గడుపుతున్న ఈ ఆటగాళ్లు కాస్త విరామం కోరుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో  దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తో పాటు ఐర్లాండ్ సిరీస్ కు ఓ జట్టును ఎంపిక చేసి.. తర్వాత ఇంగ్లాండ్  తో టెస్టులు, టీ20 లకు రెగ్యులర్ టీమ్ ను ఎంపిక  చేసేందుకు సెలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు. 

రెండు జట్లు ఎందుకు..? 

- ఐపీఎల్ లో చాలా మంది మల్టీ ఫార్మాట్ (మూడు ఫార్మాట్లలో ఆడే) ప్లేయర్లు తీరికలేని క్రికెట్ ఆడి విశ్రాంతి కోరుకుంటున్నారు. 
- కోహ్లి, రాహుల్, రోహిత్ శర్మ, బుమ్రా, పంత్ లకు విశ్రాంతినిచ్చే సెలెక్టర్లు.. వాళ్లు తిరిగి ఇంగ్లాండ్ టూర్ వరకు  ఫ్రెష్ గా ఉంటారని భావిస్తున్నారు.
- సౌతాఫ్రికా సిరీస్ లో శిఖర్ ధావన్ లేదా హార్ధిక్ పాండ్యా ను కెప్టెన్ గా నియమించే అవకాశముంది. వీరితో పాటు ఐపీఎల్ లో మెరిశిన మరికొంత మంది యువ భారత  ఆటగాళ్లను పరీక్షించనున్నారు.  వారిలో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్, మోహ్సిన్ ఖాన్,  జితేశ్ శర్మ  లను జట్టులోకి తీసుకునే అవకాశముంది.
- దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ తో  సిరీస్ కు కూడా ఈ జట్టునే కొనసాగించే అవకాశముంది.  

ఇంగ్లాండ్ తో.. 

- ఇక ఇంగ్లాండ్ తో టెస్టులకు  రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లి, పంత్, బుమ్రాలు తిరిగి జట్టుతో చేరతారు.  
- అయితే ఇంగ్లాండ్ తో టెస్టులకు మాత్రం.. రహానే కు చోటు దక్కడం కష్టమే. గాయం కారణంగా  అతడు ఇప్పటికే ఐపీఎల్ నుంచి దూరమైన విషయం తెలిసిందే. 
- రహానే కు చోటు దక్కకపోయినా ఇంగ్లాండ్  లో కౌంటీలలో అదరగొడుతున్న  పుజారాకు తుది జట్టులోకి స్థానం దక్కొచ్చు.  
- శుభమన్ గిల్, హనుమా విహారి, శ్రేయస్ అయ్యర్ లకు కూడా ఇంగ్లాండ్ తో ఒక టెస్టు, టీ20 లకు ఛాన్స్ దక్కొచ్చు. ఐపీఎల్ లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్, అంతకుముందే లంకతో సిరీస్ లో గాయపడ్డ  దీపక్ చాహర్ కూడా ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కల్లా ఫిట్నెస్ సాధించొచ్చని అంచనా. 
- ఈ రెండు జట్లకు సంబంధించిన  పూర్తి వివరాలు మే 25న వెల్లడవుతాయి. మే 23న ముంబైలో  చేతన్ శర్మ నేతృత్వంలోని  జాతీయ సెలెక్షన్ కమిటీ  సమావేశం కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios