Asianet News TeluguAsianet News Telugu

నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌: మొతేరాలో మెరిసిన సౌరవ్ గంగూలీ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో కీలక ఘట్టమైన ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమం ముగిసింది. అహ్మాదాబాద్‌లో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో ట్రంప్-మోడీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 

BCCI President Sourav Ganguly, Jay Shah attend 'Namaste Trump' event at Motera Stadium
Author
Ahmedabad, First Published Feb 24, 2020, 3:44 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో కీలక ఘట్టమైన ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమం ముగిసింది. అహ్మాదాబాద్‌లో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో ట్రంప్-మోడీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు విచ్చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు బోర్డు సెక్రటరీ జై షాలు మొతేరాకు వచ్చారు.

Also Read:భారత్ శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివి: మోడీపై ట్రంప్ ప్రశంసలు

అంతకుముందు భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తో కలిసి ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ.. ట్రంప్ కుటుంబసభ్యులకు ఘనస్వాగతం పలికారు.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇతర ఉన్నతాధికారులను పలకరించిన అనంతరం భారత త్రీవిధ దళాల గౌరవ వందనాన్ని ట్రంప్ స్వీకరించారు. అక్కడి నుంచి సుమారు 22 కిలోమీటర్ల పాటు రోడ్డు మార్గంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు.

Also Read:టాక్ ఆఫ్ ది కంట్రీ: తల్లీ కూతుళ్ల డ్రెస్సింగ్ స్టైల్ కి నెటిజన్లు ఫిదా

దారి పొడవునా భారత్, అమెరికా జాతీయ పతాకాలతో ప్రజలు ట్రంప్‌కు స్వాగతం పలికారు. అనంతరం మొతేరా స్టేడియంలో 1.10 లక్షల మంది సమక్షంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రరాజ్యాధినేత భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అహ్మదాబాద్ పర్యటను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన ఆగ్రా బయల్దేరారు. సాయంత్రం భార్యతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్‌ను ట్రంప్ సందర్శించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios